కిడ్నీలో స్టోన్స్ వున్న వారు ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లును ఎంచుకోవాలి. ముఖ్యంగా కొన్ని ఆహార పదార్ధాలను (Drumstick Leaf Kidney Health) అవసరమైన మేర తీసుకోవాలి.
కొన్నింటిని అయితే ‘కిడ్నీల ఆరోగ్యం’ దృష్ట్యా పూర్తిగా దూరం పెట్టాల్సి వస్తుంది.
మరికొన్ని వాటిని ఖచ్చితంగా తమ మెనూలో చేర్చుకోవాల్సి వుంటుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Drumstick Leaf Kidney Health.. మునగ ఆకుతో కిడ్నీ స్టోన్స్కి చెక్ పెట్టేయండిక.!
మునగ ఆకు.. ఆకుకూరల్లో చాలా తక్కువగా దీన్ని వినియోగిస్తుంటారు. కానీ, మునగాకును ఎక్కువగా తీసుకునేవారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా వుంటుందని సర్వేలు తెలియజేస్తున్నాయ్.
మునగాకులో ఒమేగా 3 ఫాటీ ఆమ్లాలు ఎక్కువగా వుండడం వల్ల కిడ్నీ స్టోన్ సమస్య వున్నవాళ్లకు ఇది మంచి ఔషధంగా చెబుతున్నారు.
Also Read: విన్నారా.? మళ్ళీ ఆ ఆయుర్వేదమే దిక్కు.!
మునగాకును తరచూ మన మెనూలో భాగం చేసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఈజీగా కరిగిపోయి, మూత్ర విసర్జన ద్వారా బయటికి వచ్చేందుకు తోడ్పడుతుందట.
కేవలం మునగాకు మాత్రమే కాదండోయ్. మునగ కాయల్లోనూ మనం పైన చెప్పుకున్న పోషకాలన్నీ సమృద్ధిగా లభిస్తాయ్..
వంటింటి చిట్కాలు చిన్న చిన్న సమస్యలకు తేలికైన పరిష్కారాలు చూపుతాయి. అయితే, ఏ చిట్కా విషయంలో అయినా వైద్య సలహా తీసుకోవడం అత్యుత్తమం.
ఎందుకంటే, మనం వాడే ప్రతి వస్తువూ కల్తీ అయిపోతోంది.. వంటింటి చిట్కాల్లో ఈ కల్తీ సరుకు తెచ్చే అనర్థాలు తక్కువేం కాదు సుమీ..
అలాగే, పురుగుల మందులు చల్లిన ఆకుకూరల విషయంలో అప్రమత్తంగా వుండాలి. జర జాగ్రత్త.
Mudra369
సో, మునగాకుతోపాటు మునగా కాయలు కూడా తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
మునగకాయల చుట్టూ సినిమాల్లో చేసే కామెడీ వేరు.. ఆ మునగకాయ వల్ల శరీరానికి జరిగే మేలు వేరు.! మీకర్థమవుతోందా.?
అన్నట్టు, కిడ్నీలో రాళ్ళ సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యుల సూచన మేరకు తగినన్ని నీళ్ళు తీసుకోవాల్సి వుంటుంది. రోజూ వ్యాయామం తప్పనిసరి.