Naatu Naatu For Oscars.. తెలుగు సినిమా సరికొత్త చరిత్రను సృష్టించింది. ఆస్కార్ బరిలోకి తొలిసారిగా ఓ తెలుగు పాట దూకింది. అదీ మామూలుగా కాదు.!
రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీయార్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అంతర్జాతీయ వేదికలపై ఇప్పటికే ఎన్నో అవార్డుల్ని అందుకున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకి ఇటీవల ‘గోల్డెన్ గ్లోబ్’ పురస్కారమూ దక్కింది. అప్పుడే, ఆస్కార్ బరిలోకి గ్రాండ్ ఎంట్రీ ‘నాటు నాటు’ పాటకి దక్కిందని అంతా అనుకున్నారు.
ఇప్పుడిక అధికారికం..
ఔను.! ఆస్కార్ బరిలో నిలిచిందిప్పుడు ‘నాటు నాటు’ సాంగ్. ఇది అధికారికం. తాజాగా ప్రకటించిన నామినేషన్స్ లిస్టులో ‘నాటు నాటు’ పాట చోటు దక్కించుకుంది.
‘నాటు నాటు’ పాట కోసం రామ్ చరణ్, ఎన్టీయార్ చేసిన డాన్సులు.. ఆ ఎనర్జీకి.. ప్రపంచం మొత్తం ఫిదా అయ్యింది.! ఆస్కార్ పరిగెత్తుకుంటూ రావడమే తరువాయి.!
Mudra369
ఉత్తమ నటుడు కేటగిరీలో యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి (Young Tiger NTR) అవకాశం దక్కుతుందని చాలామంది అనుకున్నారుగానీ, ప్చ్.. అది జరగలేదు.

అయితేనేం, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో (Mega Power Star Ram Charan) కలిసి యంగ్ టైగర్ ఎన్టీయార్ ‘నాటు నాటు’గా ఆస్కార్ బరిలోకి దిగాడు.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ (Naatu Naatu Song) పాట నామినేట్ అయ్యింది. ఈ పాటకి ఆస్కార్ దక్కడం లాంఛనమేనన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన.
Naatu Naatu For Oscars తెలుగు పాటకి పట్టాభిషేకం..
చంద్రబోస్ ఈ పాటకి సాహిత్యం అందించగా, కీరవాణి అందించిన సంగీతం, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవల వాయిస్, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ.. వాట్ నాట్.. అన్నీ సూపరంతే.!
Also Read: మెగాస్టార్ చిరంజీవి అంటే భయమా.? గౌరవమా.?
భాషతో సంబందం లేకుండా ప్రపంచమంతా ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులేస్తోందంటే.. అదే ‘నాటు నాటు’కి ఆస్కార్ కంటే గొప్ప గౌరవం.!