Minister Political Treatment.. ఓ మంత్రిగారికి అనారోగ్యం సంభవించింది. పొరుగు రాష్ట్రానికి వైద్యం కోసం వెళ్ళారు.! మామూలుగా అయితే, ఈ వార్తలో వింతేమీ లేదు.!
కానీ, అసలు విషయం వేరే వుంది.! ‘మా రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు అత్యద్భుతం. ప్రభుత్వాసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులతో ధీటుగా వున్నాయ్..’ అని చెప్పడమే అసలు సమస్య.
అంత గొప్పగా ప్రభుత్వాసుపత్రుల్ని మీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తే, కాలు బెణికినదానికే, పొరుగు రాష్ట్రానికెళ్ళి వైద్య చికిత్స చేసుకోవాల్సిన ఖర్మ ఏం పట్టింది.?
వస్తుంది.. ఇలాంటి ప్రశ్న ఖచ్చితంగా జనం నుంచి వచ్చి తీరుతుంది.!
ఓ మంత్రి.. పైగా, మహిళా మంత్రి విషయంలో ఇలా ర్యాగింగ్ చేయడం తగునా.? అంటూ.. సెంటిమెంటు కార్డు ప్లే చేయడం.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్టు.!
Minister Political Treatment.. ఔను.. ఇత్తడైపోయింది.!
‘ఇత్తడైపోద్ది..’ అంటూ అడ్డగోలు విమర్శలు రాజకీయాల్లోనూ చేయడం, సదరు మంత్రిగారికి అలవాటు. అప్పుడప్పుడూ బూతులూ మాట్లాడేస్తుంటారు.
చెప్పే మాటలకీ.. చేసే పనులకీ పొంతన లేకపోతే.. ఖచ్చితంగా జనం ప్రశ్నిస్తారు, నిలదీస్తారు.! ప్రజలు ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పి తీరాలి.

మంత్రిగారు పొరుగు రాష్ట్రానికి వైద్య చికిత్స కోసం వెళ్ళారంటే, ఆ మంత్రిగారు పదవి వెలగబెడుతున్న రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు సరిగ్గా లేవనే అర్థం.
ప్రజలేమో, సరైన వైద్య సౌకర్యాలు లేని రాష్ట్రంలో ఇబ్బందులు పడాలా.? మంత్రిగారేమో, కాలు నొప్పికే పొరుగు రాష్ట్రానికి వైద్య చికిత్స కోసం పారిపోవాలా.? ఏం పద్ధతి ఇది.?
Also Read: Environment Day: చేతనైతే మొక్కల్ని నాటండి.! పీకేయకండి.!
నోరు అదుపులో పెట్టుకుంటే, ఇంత రచ్చ జరిగేది కదా.! అన్ని అనర్ధాలకీ ఆ ‘పనికిమాలిన నోరే కారణం’ అన్నది అనాదిగా పెద్దలు చెబుతున్న మంచి మాట.!
చివరగా.. సదరు మంత్రిగారు అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలనీ.. మానసిక అనారోగ్యం కూడా మెరుగుపడి.. ఇకపై బూతులు మాట్లాడకుండా వుండాలని ఆశిద్దాం.!
శరీరానికి వున్న అనారోగ్యానికి వైద్య చికిత్స వుంటుందిగానీ.. నోటి దురదకి వైద్యం ఇప్పటిదాకా కనుగొనబడలేదు.. భవిష్యత్తులోనూ ఎవరూ కనుగొనలేరు.!