Naatu Naatu Chandrabose.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా.. ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా ‘నాటు నాటు’ పాట మార్మోగుతోంది. తెలుగులో లిరిక్స్ అర్థం కాకపోయినాసరే, డాన్సులేస్తోంది ప్రపంచం.!
‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెలుగుతోపాటు వివిధ భాసల్లోకి డబ్ అయిన సంగతి తెలిసిందే. అలా అన్ని భాషల్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతోపాటు, ‘నాటు నాటు’ పాట కూడా సూపర్ హిట్ అయ్యింది.
మిగతా భాషల్లో ‘నాటు నాటు’ పాట సంగతి పక్కన పెడితే, తెలుగులో ‘నాటు నాటు’ పాట చాలా విమర్శల్ని ఎదుర్కొంది.. అదీ లిరిక్స్ పరంగా.!
Naatu Naatu Chandrabose ఇదేం పాట అన్నారప్పుడు.!
‘పాటలో జోష్ వుంది.. కానీ, సాహిత్యం చెత్త..’ అనే విమర్శలొచ్చాయి. అప్పట్లో పాటల రచయిత చంద్రబోస్ చాలా బాధపడ్డాడు.
నిజానికి, చంద్రబోస్‌కి విమర్శలు, అవమానాలు కొత్త కాదు. విమర్శల దారి విమర్శలదే.. ఆయన దారి ఆయనదే.! ఇప్పుడంతా చంద్రబోస్‌ని ఆకాశానికెత్తేస్తున్నారు.
Also Read: Waltair Veerayya.. ఓర్నీ.! నువ్వు కూడానా.?
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డుల రేసులో ‘నాటు నాటు’ పాటకు చోటు దక్కింది. సంగీత దర్శకుడు, సింగర్స్‌తోపాటు, పాటల రచయిత పేరు కూడా ఆస్కార్ వార్తల్లో కనిపిస్తోంది.
తెలుగు పాట గర్వపడుతోందిప్పుడు చంద్రబోస్‌ని చూసి.! ఇన్నేళ్ళుగా ఎదుర్కొన్న అవమానాలన్నీ ఇకపై జుజుబీ అంతే.!