Viswavasu Ugadi Subhakankshalu Mudra369.. ఉగాది.. అంటే, యుగానికి ఆది.. అని కూడా అంటుంటారు.! తెలుగు సంవత్సరాది ఉగాదికి వున్న ప్రత్యేకత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.!
ఇంగ్లీషు సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పడానికి, నానా హైరానా పడతాం. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, పాత సంవత్సరంలోనే చెడు అలవాట్లకు స్వస్తి చెప్పాలనే నిర్ణయాలు తీసుకుంటాం.
మరి, మన తెలుగు సంవత్సరాదిని ఇంకెంత ఘనంగా జరుపుకోవాలి.? ‘హ్యాపీ ఉగాది’ అనేస్తే సరిపోతుందా.? అసలు, ఉగాది ప్రత్యేకత ఏంటి.?
Viswavasu Ugadi Subhakankshalu Mudra369.. షడ్రుచుల సమ్మేళనం.. ఉగాది.!
మీలో ఎంతమందికి షడ్రుచుల గురించి తెలుసు.? షడ్రుచులు అంటే, ఆరు రుచులు.! ఉప్పు, కారం, పులుపు, తీపి, చేదు, వగరు.! వీటిల్లో ఏది ఎక్కువగా తిన్నా కష్టమే.
తెలుగు సంవత్సరాది.. ఉగాది రోజున, ఉగాది పచ్చడి చేస్తాం కదా.! అందులో, ఈ షడ్రుచులు అన్నీ కలిసి వుంటాయి. అన్నీ కలిశాక, ఆ రుచి ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.!
తీపి కోసం బెల్లం, చేదు అలాగే వగరు కోసం వేప పువ్వు, పులుపు కోసం మామిడి కాయ, కాసింత ఉప్పు.. ఆపై, కొత్త కారం.. ఇవీ, ఉగాది పచ్చడిలో వినియోగించేవి.
అరటి పండు, కొబ్బరి సహా, మరికొన్ని కూడా కలుపుతుంటారు కొందరు. ఎవరి ఇష్టం వాళ్ళదనుకోండి.. అది వేరే సంగతి.
విశ్వావసు నామ సంవత్సర శుభాాకాంక్షలు..
కొత్త తెలుగు సంవత్సరాదికి స్వాగతం పలుకుతోంది ముద్ర 369 డాట్ కామ్.! పాఠకులందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు.
ఈ కొత్త తెలుగు సంవత్సరంలో, మీకు అన్నీ శుభాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాం.
– yeSBee