Janhvi Kapoor Nose Ring.. అమ్మాయిల అలంకరణలో ముక్కు పుడకకు ప్రత్యేకమైన స్థానం వుంది. ఎన్ని ఆభరణాలు ధరించినా, అదేంటో ఒక్క ముక్కు పుడక తెచ్చే అందం వర్ణనాతీతం.
ముక్కు పుడకలో ముక్కెరది మరో ప్రత్యేక స్థానం. ఆ ముక్కెరలో అమ్మాయిల అందాన్ని వర్ణించడంలో కవుల కళాత్మకత అంతా ఇంతా కాదు.
అలాంటి కళాత్మకమైన లుక్స్‌లో అతిలోక సుందరి జాన్వీ కపూర్ దర్శన మిచ్చింది. వజ్రాలు పొదిగిన ముక్కెరతో జాన్వీ కపూర్‌ని చూసిన నెటిజనం స్టన్ అవుతున్నారు.

జాన్వీని అలా చూసిన కుర్రోళ్లు కవులుగా మారి, తమలోని కవితాత్మకతకు పదును పెడుతున్నారు. ముక్కుకు ముక్కెరతో ఎవరీ బిజిలీ.? అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
అందాల అజంతా శిల్పానివే.!
అతిలోక సుందరిని ‘దేవ సుందరి’గా అభివర్ణిస్తున్నారు. నిజమే ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ముక్కెరలో జాన్వీ కపూర్ అందం మైమరిపిపిస్తోందంతే.
ఫ్యాషన్ ట్రెండ్స్‌ని ఫాలో చేయడంలో జాన్వీ కపూర్ తనకు తానే సాటి. అలాగే హాట్ అప్పీల్‌లోనూ. అయితే, తాజాగా జాన్వీ కపూర్ అజంతా శిల్పంలా మారిపోయింది. ఆ క్రెడిట్ అంతా ఆ ముక్కెరదేనేమో.

నారకట్టు చీరలో ముక్కుకు ముక్కెరతో.. దేవతా సుందరిలాగే దర్శనమిస్తోంది. ఏదైనా సినిమా కోసం జాన్వీ కపూర్ ఈ గెటప్‌లో దర్శనమిచ్చిందా.? ఏమో.!
కొత్త కొత్తగా వున్నదే..! స్వర్గమిక్కడే అన్నదే.!
హాట్ అప్పీల్‌తో పాటూ, అప్పుడప్పుడూ ట్రెడిషనల్ లుక్స్‌లోనూ జాన్వీకపూర్ కనిపించింది. కానీ, తాజా అప్పియరెన్స్ మాత్రం వెరీ వెరీ స్పెషల్.
Also Read: బీస్ట్ సమంత.! ‘తిండిలో కాదు, ‘పవర్’ నీ ఆలోచనల్లో.!
కానీ, ఈ తరహా లుక్స్‌లో జాన్వీని తొలిసారి చూస్తున్న అనుభూతి కలుగుతోంది. ఈ అనుభూతి అత్యద్భుతం.. అంటూ నెటిజనం తెగ మురిసిపోతున్నారు.
ఏది ఏమైనా ఈ సరికొత్త లుక్స్‌లో జాన్వీ కపూర్ సోషల్ మీడియా అటెన్షన్‌ని నెక్స్‌ట్ లెవల్‌లో క్యారీ చేసేస్తోందంతే.! ఇక కెరీర్ విషయానికొస్తే, ఇటీవలే ‘మిలీ’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది జాన్వీ కపూర్.