Table of Contents
Lahari Shari Butterfly Tattoo.. చక్కనమ్మకి పచ్చబొట్టు అదనపు అందాన్నిస్తుందా.! అన్ని పచ్చబొట్లూ అందాన్నివ్వవుగానీ.. అదేంటో.. పచ్చ బొట్టు అదేనండీ.! టాటూస్ అంటే యూత్‌కి అదో పిచ్చిలా తయారయ్యిందిప్పుడు.
ఒకరిని చూసి ఇంకొకరు వాత పెట్టుకుంటున్నారంతే.! పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లే.! అయితే, ఈ పచ్చబొట్టు ఎంత డేంజర్ అని చెబుతున్నా మానడం లేదు.
ఒకప్పుడు సెలబ్రిటీలు మాత్రమే పచ్చబొట్టు విరివిగా వేయించుకునేవారు. కానీ, ఇప్పుడా పైత్యం సామాన్య జనాల్లోనూ ఎక్కువయిపోయింది.
Lahari Shari Butterfly Tattoo.. ప్రేమకు గుర్తుగా.!
పెళ్లయిన ఆడవారు లేదా మగవారు తమ భర్త లేదా భార్య పేరును పచ్చబొట్టుగా వేయించుకుంటంటుంటే.. ప్రేమలో పీకల్లోతు మునిగిపోయిన వారు తమ ప్రియుని లేదా ప్రియురాలి పేరును పచ్చబొట్టుగా వేయించుకుంటున్నారు.

ఏం.! పచ్చబొట్టు వేయించుకుంటేనే ప్రేమ వున్నట్టా.! సర్లెండి ఎవరి పిచ్చి వారికానందం. ఇక సెలబ్రిటీల విషయానికొస్తే, అందాల భామలు తమ ప్రయివేట్ ప్లేస్‌లలో పచ్చబొట్లు వేయించుకుని సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నారు.
స్కిన్ ఎలర్జీలతో పాటూ, అత్యంత డేంజరస్ క్యాన్సర్ వంటి రోగాలొస్తాయని చెప్పినా సెలబ్రిటీలు ఈ టాటూలు వేయించుకోవడం మానడం లేదు. చెప్పాం కదా. వాళ్ల పిచ్చి ఆనందం.!
ఓహో సీతాకోక చిలకా.!
తాజాగా బిగ్‌బాస్ బ్యూటీ లహరి షెరి తన వీపుపై పచ్చ బొట్టు వేయించుకుంది. ఆ పచ్చబొట్టును ఎక్స్‌పోజ్ అయ్యేలా స్పెషల్ ఫోటో షూట్ చేయించుకుని సోషల్ మీడియాలో ఆ పిక్స్ అప్‌లోడ్ చేసింది.

దాంతో, ఈ పచ్చబొట్టు ముచ్చట చర్చకొచ్చింది మరి. అయితే, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి.! లహరి షెరి వేయించుకున్న సీతా కోకచిలుక పచ్చబొట్టు అయితే బహు సుందరంగా వుందిలెండి.
పచ్చబొట్టు ఏదైనా సరే, సమ్‌థింగ్ స్పెషల్‌గానే ప్రొజెక్ట్ అవుతుంటుంది. కొందరు మెడ పైనా మోచేతి పైనా, భుజాల పైనా ఎక్కడైనా సరే, పది మందిలో వున్నప్పుడు వారిని డిఫరెంట్‌గా ప్రమోట్ చేసుకోవడానికి పచ్చబొట్టు ఓ అలంకరణ, ఆభరణంగా చెప్పొచ్చేమో.
ఈ బ్యూటీ ‘బిగ్’ రిచ్ గురూ.!
అయితే, సెలబ్రిటీలు వేయించుకునే పచ్చబొట్లు హై స్టాండర్డ్స్‌లో నిపుణుల పర్యవేక్షణలో వేయించుకుంటారు. కానీ, సామాన్యుల పరిస్థితి అలా కాదు. సో, కామన్ పీపుల్ టాటూస్ పట్ల జర జాగ్రత్త సుమీ.!
అన్నట్లు లహరి షెరి విషయానికి వస్తే.. ‘బిగ్‌బాస్’ తెలుగు సీజన్‌లో తనదైన పాపులారిటీ దక్కించుకుంది. హౌస్‌లో వున్నది చాలా తక్కువ రోజులే అయినా అందరికీ గుర్తుండిపోయింది.

హౌస్‌లో తెచ్చుకున్న పాపులారిటీని సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా బాగా క్యాష్ చేసుకుంది. బేసిగ్గా లహరి షెరి బైక్ లవర్.
అంతేకాదు, హై అండ్ కార్లంటే పిచ్చి. తన గ్యారేజ్‌లో బోలెడన్ని కాస్ట్‌లీ కార్లు, డిఫరెంట్ బైకులు వుంటాయ్. వాటితోనే సోషల్ మీడియాలో తనను తాను డిఫరెంట్‌గా ప్రమోట్ చేసుకుంటూంటుంది లహరి షెరి.