Taraka Ratna Health Critical.. నందమూరి తారక రత్న తీవ్ర గుండెపోటుకి గురయ్యాడు.
ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆయన ప్రాణాల్ని కాపాడేందుకు నారాయణ హృదయాల వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
అత్యాధునిక వైద్య సౌకర్యాలున్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి కుప్పం నుంచి తారక రత్నను తరలించారు.
అక్కడాయనకు అనేక వైద్య పరీక్షలు నిర్వహించి, మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నారు వైద్యులు. నందమూరి బాలకృష్ణ అక్కడే వుండి, పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Taraka Ratna Health Critical బెంగళూరుకి జూనియర్ ఎన్టీయార్, కళ్యాణ్ రామ్..
సోదరుడి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా వుందని తెలియడంతో జూనియర్ ఎన్టీయార్ అలాగే కళ్యాణ్ రామ్ కూడా బెంగళూరు చేరుకున్నారు.
దాదాపుగా నందమూరి కుటుంబమంతా ప్రస్తుతం బెంగళూరులో వున్నట్లే. నందమూరి తారక రత్న అంటే, నందమూరి కుటుంబంలో అందరికీ అంత ఇష్టం.
ఈ రూమర్లేంటి బ్రదర్.!
నందమూరి తారక రత్న (Nandamuri Taraka Ratna) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా వున్న మాట వాస్తవం.
పేగుల్లో తలెత్తిన రక్త స్రావం సమస్య కావొచ్చు, ఇతరత్రా అనారోగ్య సమస్యలు కావొచ్చు.. తారక రత్న కోలుకునే అవకాశాల్ని దెబ్బతీస్తున్నాయని తెలుస్తోంది.

వైద్యులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మరోపక్క అభిమానులు ఆయన కోలుకోవాలని తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: పవన్ సాక్షిగా.! బాలయ్య నోట బండ్ల మంత్రం.!
ఇంకోపక్క, తారక రత్న (Nandamuri Taraka Ratna) పరిస్థితిపై రకరకాల రూమర్లను ప్రచారం చేస్తున్నారు కొందరు. రాజకీయ విమర్శల్నీ ఈ రూమర్లకు జత చేస్తున్నారు.
వీలైతే.. తారక రత్న త్వరగా కోలుకోవాలని ప్రార్ధిద్దాం. లేదంటే, స్పందించకుండా వుండటమే మంచిది. పది మంది బతుకు కోదాం.! దయచేసి బతికుండగానే చంపేయొద్దు.. అది ఎవరి విషయంలో అయినాసరే.!
అద్భుతం జరగాలి.! తారక రత్న త్వరగా కోలుకోవాలి.! ఇదే నందమూరి అభిమానుల ఆకాంక్ష. కేవలం నందమూరి అభిమానులే కాదు, అందరూ కోరుకుంటోన్నది ఇదే.