Bandla Ganesh.. సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ అడపా దడపా సూక్తులు చెబుతుంటాడు. ఈసారి, కాస్త ‘గట్టివైన’ సూక్తులే చెప్పాడు. నిజానికి, వాటి గురించి ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే సుమీ.!
అసలు బండ్ల గణేష్‌లో ఈ మార్పు ఎందుకు వచ్చినట్లు.? ఎవరైనా ఆయన్ని ఏమన్నా అన్నారా.? దూరం పెట్టారా.?
పరమశివుడికి భక్తుడైన బండ్ల గణేష్, ‘రాయిలో దైవత్వం వుందని తెలుసుకున్నాం.. మనిషిలో మానవత్వం వుందని గుర్తించలేకపోతున్నాం..’ అన్నాడెందుకు.?
‘జీవం లేని వాటిపై వున్న ప్రేమ, భక్తీ.. ప్రాణాలతో వున్నప్పుడు ఎందుకు వుండదో.?’ అంటూ అనుమానం వ్యక్తం చేశాడు బండ్ల గణేష్.
Bandla Ganesh.. స్వార్ధం.. ఎవరిదబ్బా.?
‘మనిషి వేసే ప్రతి అడుగూ స్వార్ధంతోనే.. ప్రతి మాటా స్వార్ధంతోనే.. పబ్లిసిటీ.. పబ్లిసిటీ.. దీన్ని వదిలేసినప్పుడే మానవత్వం బయటకు వస్తుంది’ అంటున్నాడు బండ్ల గణేష్.
బండ్లన్న అసహనం తన ‘దేవర’ పవన్ కళ్యాణ్ మీదేనన్న అనుమానాలు ఓ వైపు వినిపిస్తున్నాయి.
ఇంకో వైపు బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ ‘హై ఓల్టేజ్’ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ‘ఆహా’లో నేడే ప్రసారం కానుంది.
ఇంతకీ, అసలు కథ ఏంటి.? బండ్లన్న సూక్తుల వెనుక అసు కోణమేంటి.?
Mudra369
మంచిదే కదా.? కానీ, పబ్లిసిటీ లేకపోతే ఎవరూ గుర్తించరన్న విషయం బండ్ల గణేష్ కంటే బాగా ఎవరికి తెలుసు.? బహుశా అతి పబ్లిసిటీ ఆయన కొంప ముంచినట్లుందన్నది చాలామంది అభిప్రాయమ్.
ఎలుక రాయి.!
‘ఎలుక రాతిదైతే పూజిస్తాం.. ప్రాణాలతో వుంటే తరిమేస్తాం.. పాము రాతిదైతే పాలు పోస్తాం.. ్రాణాలతో వుంటే కొట్టి చంపేస్తాం..’ అంటూ జీవిత సత్యాన్ని చెప్పాడు బండ్ల గణేష్. ఇదీ నిజమే సుమీ.!
‘తల్లిదండ్రుల ఫొటోలకు దండేసి దండం పెడతాం.. ప్రాణాలతో వున్నప్పుడు పట్టించుకోం..’ అంటున్నాడు బండ్ల. లోకం తీరే అంత కదా.!
Also Read: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’: బాబోయ్.! భయపెట్టేస్తున్నారు.!
‘చనిపోయినవారికి భుజాలు అందిస్తాం.. బ్రతికున్నప్పుడు గేటు దగ్గరకి వస్తే అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వం..’ అని బండ్ల పేర్కొన్నాడు. ఇంతకీ, అలా గేటు దగ్గరకు వెళితే అపాయింట్మెంట్ ఇవ్వనిదెవరో.! ఎవరికో.?
బండ్ల ట్వీట్ల వెనుక చాలా ‘మానసిక సంఘర్షణ’ వుంటుంది. అది ఆయనకి మాత్రమే తెలుసు. ఎవర్నో ఆయన టార్గెట్ చేశాడు. ఎవరబ్బా.? ఎందుకబ్బా.?