Table of Contents
Pragya Jaiswal Summer.. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం.. స్విమ్మింగ్ పూల్‌ని ఆశ్రయించడం.. కుదిరితే విదేశాలకు చెక్కేసి.. బిచ్‌లలో సేదతీరడం.. మామూలే.!
అయితే, ఏ సీజన్ వచ్చినాసరే.. అందాల విందు విషయంలో అస్సలు మొహమాటపడరు బ్యూటిఫుల్ భామలు.!
గ్లామర్ ప్రపంచం కదా.. కాదేదీ, గ్లామర్‌కి అనర్హం. ఇంకా చలి కాలం వెళ్ళనే లేదు.. అప్పుడే, ‘సమ్మర్’ వచ్చేస్తోందంటూ ‘హింట్’ ఇచ్చేస్తోంది వాడిగా.. వేడిగా.. అందాల భామ ప్రగ్యా జైస్వాల్.!
Pragya Jaiswal Summer.. సమ్మర్ వచ్చేస్తోంది..
పొట్టి పొట్టి దుస్తులేసుకుని సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యే ప్రగ్యా జైశ్వాల్.. సమ్మర్ పేరు చెప్పి, సమ్మర్ వేర్‌లో దర్శనమిచ్చింది.
విస్కోస్ క్లాత్ లాంగ్ ప్యాంట్ ధరించింది. వైట్ అండ్ వైట్ డిజైనర్ వేర్ అది. షార్ట్ టాప్ ధరించి అందాల విందు చేస్తోంది. బుట్ట చేతులు ఈ టాప్‌ని మరింత అందంగా మలిచేశాయ్.
బ్యూటీ ఆఫ్ స్టైలింగ్..
కళ్లకు కూలింగ్ గ్లాస్ పెట్టుకుని, స్టైలిష్‌గా ఓ లుక్కిచ్చింది. ఈ లుక్‌కే కుర్రకారులో గిలిగింతలు మొదలవుతున్నాయ్. అయితే, సమ్మర్ అంటోంది కదా.!

అవునవును.. క్లీవేజ్ గ్లామర్‌తో సెగలు రేపుతోంది కూడా. లూజ్ హెయిర్ స్టైల్ ప్రగ్యా స్టైల్‌ని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లింది.
ఇక సినిమాల విషయానికి వస్తే, ‘కంచె’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాకే సూపర్ హిట్టు కొట్టింది. కానీ, లక్కు చిక్కలేదు.
హిట్టు ‘అఖండ’మే అయినా..
దాంతో రేస్‌లో వెనకబడిపోయింది. తొలి సినిమాకి క్లాసిక్ బ్యూటీ అని పేరు తెచ్చుకుంది. ఆ పేరుని మార్చి, గ్లామరస్ బ్యూటీ అనిపించుకోవడానికి చాలానే ప్రయత్నాలు చేసింది.
Also Read: అనుపమకి ప్రమోషన్.! రిస్క్ చేస్తోందా.? లక్కు కలిసొచ్చిందా.?
‘కంచె’ తర్వాత అంచెలంచెలుగా గ్లామర్ డోస్ పెంచేసింది. కమర్షియల్ హీరోయిన్‌గానూ ప్రూవ్ చేసుకుంది. అయినా అదృష్టం ఆమడ దూరంలోనే వుంది ప్రగ్యా జైశ్వాల్‌కి.
‘అఖండ’ రూపంలో ఓ భారీ హిట్ సొంతం చేసుకున్నా, ప్రగ్యా జైశ్వాల్ కెరీర్ టర్నింగ్ తీసుకోలేదింకా. కెరీర్ ఎలా వున్నా సరే, సోషల్ మీడియాలో ప్రగ్యా హుషారు మాత్రం యమా యాక్టివ్.!