Rakul Preet Singh.. వెండి వెలుగుల జాతర.! ఆ జాతరలో వజ్రాలే చిన్నబోతాయేమో.! ఔను, వజ్రం లాంటి ఆమె అందం ఆ వెండి వెలుగుల మధ్య చిన్నబోతున్నట్టుంది.!
కాదు కాదు, ఆ వెండి వెలుగుల నడుమ, వజ్రంలా మరిసిపోతోంది ఈ అందాల భామ.!
తెలుగుతోపాటు తమిళ, హిందీ సినిమాల్లోనూ తనదైన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రకుల్ ఎందుకో, ఈ మధ్య సౌత్ సినిమాని చిన్న చూపు చూస్తున్నట్టుంది.!
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఫుల్ బిజీగా గడిపిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్లో తెగ బిజీ అయిపోయింది.
వరుస సినిమాలతో క్షణం కూడా తీరక లేకుండా గడుపుతోంది. అయితే, బాలీవుడ్‌కి వెళ్లాకా రకుల్ బాగా మారిపోయింది.

రెగ్యులర్ కమర్షియల్ కథలను కాకుండా, డిఫరెంట్ ఫార్మేట్లో కథలను ఎంచుకుంటోంది. నటిగా ప్రూవ్ చేసుకునే పాత్రలతో మెప్పిస్తోంది.
సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా కెరీర్లో దూసుకెళుతోంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సందడి చేసింది అందాల రకుల్.
Rakul Preet Singh.. శభాష్ రకుల్..
ఓటీటీలో ఆయా సినిమాలు ఓ మోస్తరుగా అలరించినప్పటికీ, కొన్ని సినిమాల కంటెంట్స్ విషయంలో రకుల్‌ని మెచ్చుకోకుండా వుండలేకపోయారు ఆడియన్స్.

రకుల్ వెరీ లేటెస్ట్ మూవీ ‘ఛత్రీవాలీ’ విషయానికి వస్తే, ఒకింత నెగిటివ్ ట్రోల్స్ ఎదర్కొన్నప్పటికీ, అలాంటి సబ్జెక్ట్ ఎంచుకోవడంలో రకుల్ అటెంప్ట్‌కి మెచ్చుకున్న వాళ్లు కూడా లేకపోలేదు.
కొంచెం ట్రెడిషన్, కొంచెం హాట్ అప్పియరెన్స్..
ఇక, సినిమాల సంగతి ఇలా వుంటే, ఈ సినిమాల ప్రమోషన్ల పేరు చెప్పి సోషల్ మీడియాలోనూ రకుల్ పేరు మార్మోగిపోయింది.
Also Read: Swara Bhaskar: పెళ్ళైన నెల రోజులకి..!
డిఫరెంట్ ఫోటో షూట్లతో కలర్ ఫుల్ లుక్స్‌తో రకుల్ నెటిజన్స్‌ని మైమరిపించేసింది. తాజాగా సిల్వర్ కలర్ డ్రస్‌లో రకుల్ చేస్తున్న అందాల హంగామాకు శాంతం ఫిదా అవుతోంది సోషల్ లోకం.

సిల్వర్ కలర్ గాగ్రా చోళీలో ట్రెడిషనల్‌గా కనిపిస్తూనే, కావల్సినంత హాట్ అప్పీల్ ఇస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయ్.