Home » iSmart Nabha Natesh: ఓహో గులాబీ బాలా.!

iSmart Nabha Natesh: ఓహో గులాబీ బాలా.!

by hellomudra
0 comments
Nabha Natesh

Nabha Natesh iSmart: తన అందచందాలతో కుర్రోళ్ల గుండెకు ఎలా గాలమేయాలో బాగా తెలుసు ఇస్మార్ట్ ముద్దుగుమ్మ, కన్నడ కస్తూరి నభా నటేష్‌కి.

అల్లరి రవిబాబు దర్శకత్వంలో రూపొందిన ‘అదిగో’ ఆమెకు తొలి తెలుగు సినిమా. అయితే, ‘నన్ను దోచుకుందువటే’ అంటూ ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ సినిమాతో సమ్‌థింగ్ స్పెషల్‌ అనిపించింది. సుధీర్ బాబు హీరోగా నటించాడు ‘నన్ను దోచుకుందువటే’ సినిమాలో.

ఆ తర్వాత, డేరింగ్ డాషింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దృష్టిలో పడింది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో ఛాన్సు కొట్టేసింది. రామ్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

నిధి అగ్వార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది నభా నటేష్ ఈ ‘ఇస్మార్ట్ శంకర్’ కోసం. ఇక అంతే, అప్పటి నుండీ నభా నటేష్ ‘ఇస్మార్ట్’ బ్యూటీగా పాపులర్ అయిపోయింది.

Nabha Natesh iSmart.. ఇస్మార్ట్ బ్యూటీ అంతకు మించి..

వరుస ఛాన్సులతో దూసుకెళుతోంది. మంచి టాలెంట్ వున్న నటి నభా నటేష్ (Nabha Natesh). డాన్సుల్లో ధిట్ట. అవకాశమిస్తే, ఎలాంటి రోల్ అయినా హ్యాండిల్ చేయగల సత్తా వుంది అమ్మడికి. అయినా సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటూ స్లో అండ్ స్టడీ అన్న చందాన కెరీర్ రన్ చేస్తోంది ఈ ఇస్మార్ట్ అందాల నభా.

Nabha Natesh
Nabha Natesh

పాపులారిటీని మరింత పెంచుకోవాలంటే, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండాలి. అదే చేస్తోంది నభా నటేష్ (Nabha Natesh). ఎప్పటికప్పుడు హాట్ హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ నెట్టింట జబర్దస్త్ యాక్టివ్‌‌నెస్ చూపిస్తోంది నభా నటేష్.

ట్రెండ్ ఏదైనా నభా బ్రాండ్..

ట్రెడిషనల్, మోడ్రన్, అల్ట్రా మోడ్రన్.. ట్రెండ్ ఏదైనా తన ఆటిట్యూడ్‌లో ఇట్టే ఒదిగిపోతుంది. దటీజ్ నభా నటేష్. కొన్ని రకాల బ్రాండ్ ప్రమోషన్స్‌తోనూ బిజీగా వుంది నభా నటేష్.

ఇక తాజాగా గులాబీ రంగు గౌను ధరించి క్యూట్ అండ్ హాట్ లుక్స్‌తో కెవ్వు కేక పుట్టిస్తోంది నభా నటేష్ (Nabha Natesh). రంగులోనే ఈ డ్రస్సు డిజైన్‌లోనూ గులాబీ గుబాళింపు గుప్పు గుప్పుమంటోంది. అంతందంగా వుందీ డ్రస్సు డిజైన్.

Also Read: లావణ్య త్రిపాఠి ప్రేమ కథ.! పెళ్ళి వ్యధ.!

‘పింక్ ఈజ్ మై లవ్ లాంగ్వేజ్’ అంటూ ఈ అందమైన పిక్స్‌కి ఓ క్యూట్ క్యాప్షన్ కూడా ఇచ్చేసింది నభా నటేష్. దాంతో, నెట్టింట ఈ పిక్స్ తెగ వైరల్ అయిపోతున్నాయ్.

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group