Kalyanram Amigos Triple Dhamaka.. నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అమిగోస్’ విడుదలకు సిద్ధమైంది. కొత్త దర్శకుడు.. భారీ బడ్జెట్.. అన్నిటికీ మించి కళ్యాణ్ రామ్.!
ఔను, కళ్యాణ్ రామ్ సమ్‌థింగ్ చాలా చాలా స్పెషల్.! ఎందుకంటే, నటుడిగానే కాదు.. నిర్మాతగానూ ప్రయోగాల వైపే మొగ్గు చూపుతుంటాడు.
సరే, కొన్నిసార్లు ఫెయిల్యూర్స్.. మరికొన్నిసార్లు విజయాలు.. ఇవన్నీ సినీ రంగంలో మామూలే. కళ్యాణ్ రామ్ ఇందుకు అతీతమేమీ కాదు.
Kalyanram Amigos Triple Dhamaka.. జూనియర్ ఎన్టీయార్ మెచ్చిన వేళ..
బాబాయ్ కంటే.. నా కంటే కూడా ఎక్కువగా ప్రయోగాలు చేస్తున్నావ్ అన్నయ్యా.. అంటూ జూనియర్ ఎన్టీయార్ తన అన్న నందమూరి కళ్యాణ్‌రామ్‌ని పొగిడేశాడు.
నిజానికి, కళ్యాణ్ రామ్ చేసిన సినిమాలు తక్కువే. ప్రయోగాల విషయంలో బాలయ్యే (Nandamuri Bala Krishna) ఎక్కువ చేశాడు. జూనియర్ ఎన్టీయార్ (Jr NTR) చేసిన ప్రయోగాలు తక్కువ కాదు.
అయితే, నటుడిగానూ.. నిర్మాతగానూ.. కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ఎక్కువ ప్రయోగాలు చేశాడన్నది జూనియర్ ఎన్టీయార్ ఉద్దేశ్యం. అది నిజం కూడా.
అప్పుడు ఇద్దరు.. ఇప్పుడేమో ముగ్గురు..
నందమూరి కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం గతంలోనూ చేశాడు. ‘హరేరామ్’ (Hare Ram) సినిమాలో నెగెటివ్ షేడ్స్ వున్న రోల్ ఒకటి.. పాజిటివ్ రోల్ ఇంకోటి.

మొన్నటికి మొన్న ‘బింబిసార’ (Bimbisara) సినిమాలోనూ అంతే.! కాకపోతే, ఆయా నెగెటివ్ క్యారెక్టర్స్ పాజిటివ్ నోట్‌తో ముగించబడ్డాయి.
జూనియర్ ఎన్టీయార్ చేసిన ‘జై లవ కుశ’లో ఓ రోల్ నెగెటివ్ టచ్‌తో వుంటుంది.. కానీ, అది చివరికి పాజిటివ్ టోన్ తీసుకుంటుంది. మరి, ‘అమిగోస్’లో నెగెటివ్ రోల్ ఏమవుతుంది.? ఎలాంటి టర్న్ తీసుకుంటుంది.?
Also Read: సినిమాల వల్ల జనం చెడిపోతారా.? బాగుపడతారా.?
ఇదయితే ప్రస్తుతానికి సస్పెన్స్.! ప్రయోగాత్మక సినిమాలు ఎంచుకుంటున్నందుకు మాత్రం కళ్యాణ్ రామ్‌ని అభినందించి తీరాల్సిందే.
నందమూరి కళ్యాణ్ రామ్ సరసన ఈ ‘అమిగోస్’ (Amigos) సినిమాలో ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో ఆమెకిదే తొలి సినిమా.