Megastar Chiranjeevi Politics.. మెగాస్టార్ చిరంజీవి అంటే కోట్లాది మందికి అభిమానం. కొందరికి గిట్టదు కూడా.! ఎందుకు గిట్టదు.? అంటే, అదంతే.! అక్కసు కావొచ్చు, ఇంకో కారణం కావొచ్చు.!
సినిమాల్లో సాధించిన పేరు ప్రఖ్యాతుల నేపథ్యంలో, ఆయన్ని రాజకీయాల్లోనూ చూడాలనుకున్నారు చాలామంది. కానీ, చిరంజీవి రాజకీయాలకు సూటవలేదు.!
ఎందుకంటే, రాజకీయం అంటే అది వేరే ఆట.! అందులో, నిలదొక్కుకోవాలంటే మోసాలు చేయాలి. అది చిరంజీవికి చేతకాలేదు. అందుకే, ఆయన రాజకీయాలకు సరిపోలేదు. రాజకీయాల్లో నిలబడలేకపోయారు.
Megastar Chiranjeevi Politics కోడిగుడ్లు ఎందుకు దూసుకొచ్చాయ్.?
ఆయనేమీ అధికారం చేపట్టి జనాన్ని మోసం చేసెయ్యలేదు అంతకు ముందు. కానీ, ఆయన మీద కోడిగుడ్లు పడ్డాయ్. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు చిరంజీవి (Megastar Chiranjeevi).
ప్రజారాజ్యాన్ని ప్రజలు కోరుకున్నా.. రాజకీయం విషం చిమ్మింది..
జనసేన జనం కోసం నిలబడుతోంటే, అదే రాజకీయం ఎగతాళి చేస్తోంది..
Mudra369
సైనుంచి పూలవర్షం.. ఇంకోపక్క కోడిగుడ్లతో కొందరు దాడికి యత్నించారు. అలా దాడికి యత్నించినోళ్ళ వెనుకాల వున్నదెవరు.? అదే రాజకీయం.

చిరంజీవి తమ మీద దాడి చేయించారంటూ ఓ సినీ జంట అప్పట్లో మీడియా ముందు మొసలి కన్నీరు పెట్టింది. అదే జంట, ఆ తర్వాత చిరంజీవి ఎంత గొప్పోడో చెప్పింది.
రాజకీయం అంటే ఇలాగే వుంటుంది.! ఇదా రాజకీయం.? అని చిరంజీవి తెలుసుకున్నారు గనుకే, ఆ రొచ్చుకి దూరంగా వున్నారు.
చిరంజీవి తట్టుకోలేకపోయారు.. పవన్ కళ్యాణ్ సంగతేంటి.?
అన్నయ్య వద్దనుకున్న రాజకీయంలో రాణించాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). చాలా జుగుప్సాకరమైన రీతిలో ఆయన వ్యక్తిగత జీవితంపైనా, కుటుంబంపైనా దూషణలు చోటు చేసుకుంటున్నాయ్.
Also Read: సినిమాల వల్ల జనం చెడిపోతారా.? బాగుపడతారా.?
అవసరమా ఇదంతా.? పవన్ కళ్యాణ్ వల్ల ఎవరికి అన్యాయం జరిగింది.? అని అనవసరం. రాజకీయం అంటేనే ఇంత.
కొన్ని గొర్రెల కారణంగా వ్యవస్థ నాశనమైపోతోంది. పాడైపోతున్న వ్యవస్థలో ‘మంచి మార్పు’ ఆశించడం నేరమే మరి.!