Poonam Kaur Telangana సినీ నటి పూనమ్ కౌర్ రాత్రికి రాత్రి తెలంగాణ బిడ్డగా మారిపోయింది.! నిజానికి, ఆమె పంజాబీ భామ. పంజాబ్ మూలాలున్నాయ్‌గానీ, ఆమె పుట్టిందీ.. పెరిగిందీ హైద్రాబాద్‌లోనే.!
అసలు ఇప్పుడీ ‘తెలంగానం’ ఎందుకోసం.? పూనమ్ కౌర్ అంటే, సోషల్ మీడియా వేదికగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద పరోక్షంగా సెటైర్లేసే అందాల భామ.!
పలు తెలుగు సినిమాల్లో నటించింది పూనమ్ కౌర్. రాజకీయ తెరపైనా అడపా దడపా కనిపిస్తుంటుంది. ఓ సారి కాంగ్రెస్, ఇంకోసారి బీజేపీ, మరోసారి టీడీపీ.. ఇలా వేర్వేరు పార్టీల్లో సందడి చేయడం పూనమ్ కౌర్‌కి కొత్తేమీ కాదు.
పంజాబీ.. తెలంగాణ.. పూనమ్ కౌర్ ఎందుకీ కొత్త లొల్లి.?
ఉనికి కోసం ఆరాటమా.? ఇంకేదైనా రాజకీయ లక్ష్యమా.?
కారణమేదైతేనేం.. మీడియా ముందు కంటతడి పెట్టి.. పెద్ద హంగామానే చేసింది.!
మధ్యలో ‘తెలుగమ్మాయిల్ని తొక్కేస్తున్నారు’ అనే రచ్చ కూడా తెరపైకి తెచ్చింది.!
Mudra369
మొన్నీమధ్యనే రాహుల్ గాంధీ నిర్వహించిన ‘భారత్ జోడో’ యాత్రలో, ఆయనతో కలిసి కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది పూనమ్ కౌర్.
Poonam Kaur Telangana.. నిఖార్సయిన తెలంగాణ బిడ్డ..
‘నేను తెలంగాణ బిడ్డని. తెలంగాణలోనే పుట్టాను. పంజాబీ.. అంటూ నన్ను తెలంగాణ నుంచి వెలివేసే ప్రయత్నం చేయొద్దు.. మైనార్టీని కాబట్టి నా మీద అలాంటి దుష్ప్రచారాలు చేయడం తగదు’ అంటూ పూనమ్ వాపోయింది.
అంతేనా, తాను తెలుగమ్మాయిననీ.. ముంబై భామల మీద మోజుతో తెలుగమ్మాయిలకు తెలుగు సినిమాల్లో అన్యాయం చేస్తున్నారంటోంది పూనమ్ కౌర్. ఇది సమ్‌థింగ్ ఆశ్చర్యకరంగా వుంది కదూ.!

అసలెందుకీ ‘తెలంగాణ’ చర్చ తెరపైకి వచ్చినట్లు.? ప్రాంతీయత పేరుతో ఎవరు పూనమ్ కౌర్‌ని బాధ పెట్టినట్లు.?
చంద్రబాబు హయాంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. పూనమ్ కౌర్, చేనేతకు బ్రాండ్ అంబాసిడర్.. అంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
Also Read: Shriya Saran.. గ్లామరస్ ‘కబ్జా’.!
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అంటే వల్లమాలిన అభిమానం ఆమెకి. అయితే, పవన్ – పూనమ్ కౌర్‌ల మధ్య ఏదో వుందంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తుంటారు కొందరు.
మొత్తమ్మీద, పూనమ్ కౌర్ (Poonam Kaur).. ‘తెలంగానం’ కొత్త అనుమానాలకు తావిస్తోంది. బహుశా ఆమె కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుందేమో.! అంతేనా.?