Politics Corporate Education.. ఎడ్యుకేషన్‌లో వచ్చేంత డబ్బు రాజకీయాల్లో రాదు..
ఇదొక స్టేట్మెంట్.! కాదు కాదు, ఓ సినిమా డైలాగ్. ధనుష్ హీరోగా తెరకెక్కుతోన్న ‘సార్’ సినిమాలోనిది ఈ డైలాగు.! తమిళ హీరో ధనుష్ నటిస్తోన్న ఈ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది.
‘ఈ దేశంలో చదువు అనేది నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్’ అనే డైలాగ్ ‘సార్’ ట్రెయిలర్‌లో వుంది. ఆ తర్వాత, ‘ఎడ్యుకేషన్‌లో వచ్చేంత డబ్బు రాజకీయాల్లో రాదు’ అని ఇంకో డైలాగ్ కూడా వస్తుంది.
Politics Corporate Education .. సినిమా సంగతి పక్కన పెడితే..
సినిమా.. అందులోని డైలాగుల్ని పక్కన పెట్టి.. రియల్ లైఫ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.! నిజ్జంగా నిజమే ఇది.!
ఎడ్యుకేషన్ బిజినెస్ మాత్రం కార్పొరేట్ రాబందులు, రాజకీయ నాయకుల చేతుల్లో మూడు పువ్వులు.. ముప్ఫయ్ ఆరు కాయలుగా వర్ధిల్లుతూనే వుంటుంది.
Mudra369
ఔను, విద్యా రంగంలో వచ్చేంత డబ్బు రాజకీయ రంగంలోనూ రావడంలేదని చాలామంది చెబుతున్నారు. అందుకే, రాజకీయ నాయకులు విద్యా రంగంపై కన్నేశారు.
కాదు కాదు, విద్యా రంగాన్ని రాజకీయ నాయకులు కబ్జా చేశారు. మొన్నామధ్య ఓ మంత్రిగారి విద్యా సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ, ఈడీ దాడులు చేయడం చూశాం.
వందల కోట్లు.. వేల కోట్ల సామ్రాజ్యం..
వివిధ రకాల పోటీ పరీక్షలనండీ.. ప్లే స్కూల్ వ్యవహారాలనండీ.. ఏదైనాసరే, లక్షలతో కూడుకున్న వ్యవహారమే. వైద్య విద్య అయితే కోట్లతో ముడిపడి వున్న వ్యవహారం.
ఎవడండీ అన్నది.. ఈ దేశంలో విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్ అన్నది.! విద్యా రంగంలో వున్నంత ప్రాఫిట్.. అదేనండీ లాభం.. దేశంలో ఇంకే రంగంలోనూ కనిపించదు.
విద్యని అమ్ముకున్నోడికి అమ్ముకున్నంత.! ఎనీ డౌట్స్.?
Also Read: సెటైర్: ప్రభాస్‌కి జ్వరం రావడమేంటి అధ్యక్షా.?
ఇదే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయ్.. వస్తూనే వుంటాయ్. మళ్ళీ ఇదొక బిజినెస్సూ.! థియేటర్లకు జనం వస్తారు.. నచ్చితే ఈలలు వేస్తారు, నచ్చకపోతే అంతే.!
కానీ, ఎడ్యుకేషన్ బిజినెస్ మాత్రం కార్పొరేట్ రాబందులు, రాజకీయ నాయకుల చేతుల్లో మూడు పువ్వులు.. ముప్ఫయ్ ఆరు కాయలుగా వర్ధిల్లుతూనే వుంటుంది.
సంక్షేమ పథకాల ముసుగులో ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీల్లోకి కూడా ఈ పొలిటికల్ కార్పొరేట్ మాఫియా ప్రవేశిస్తోంది.! ప్చ్.! ఏమీ చేయలేం.
సినిమాల్లో మాత్రం కథ సుఖాంతమవుతుందంతే. చెడు మీద మంచి.. విజయం సాధిస్తుంది. కానీ, నిజ జీవితంలో మంచి మీద ఎప్పుడూ గెలిచేది చెడే. ఇది కలికాలం మరి.!