Home » Honey Rose.! నిజమే, వెండి తెర ‘తేనె గులాబీ’నే.!

Honey Rose.! నిజమే, వెండి తెర ‘తేనె గులాబీ’నే.!

by Mudra369 Editorial Desk
0 comments
Honey Rose

Honey Rose.. అప్పుడెప్పుడో ‘ఆలయం’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది ముద్దుగుమ్మ హనీ రోజ్. బహుశా ఆ సినిమా ఎవ్వరికీ పెద్దగా తెలియకపోవచ్చు.

ఆ తర్వాత ‘ఈ వర్షం సాక్షిగా’ అంటూ మరో తెలుగు సినిమాలోనూ నటించిందీ మలయాళ ముద్దుగుమ్మ. అది కూడా ఏమంత క్రేజ్ తెచ్చిపెట్టలేదు హనీ రోజ్‌కి.

కానీ, లేటెస్టుగా తెలుగులో ఈ అమ్మడి పేరు మార్మోగిపోతోంది. అందుకు కారణం ‘వీర సింహారెడ్డి’ సినిమానే. నిజానికి ఈ సినిమాలో హనీ రోజ్ మెయిన్ లీడ్ హీరోయిన్ కానే కాదు.

Honey Rose ‘బ్యూటీ’ ఫుల్ భారీ కటౌట్.!

కానీ, మెయిన్ లీడ్ హీరోయిన్‌కి వున్నంత క్రేజ్ దక్కించుకుంది హనీ రోజ్. బహుశా అది ఆమె పేరులోని మహత్యమనుకోవాలేమో.

పేరులోనే వుంది కదా.. హనీ. ఆకర్షించే గులాబీ. ఈ సినిమా తర్వాత హనీ రోజ్‌కి మరిన్ని తెలుగు సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయట.

Honey Rose
Honey Rose

అయితే, అవి ఏజ్డ్ రోల్సేనట. నిజానికి హనీ రోజ్ వయసు మూడు పదులే. కానీ, భారీ కటౌట్ కావడంతో, ఆ తరహా పాత్రలే ఎక్కువగా ఆఫర్ చేస్తున్నారట.

మంచి కంటెంట్ వుండి, పాత్ర నచ్చితే ఎలాంటి రోల్స్‌లోనైనా నటించేందుకు సిద్ధమే అంటోందీ హనీ పాప.

అందాల గులాబీ.. తుమ్మెదలు..

అది సరే కానీ, సోషల్ మీడియాలోనూ ఈ తేనె గులాబీని ఆకర్షించే తుమ్మెదలు ఎక్కువేనండోయ్. అదేనండీ, ఫాలోవర్లు. ‘వీర సింహారెడ్డి’ పుణ్యమా అని ఆ ఫాలోయింగ్ మరింత పెరిగిందిప్పుడు.

ఈ క్రేజ్‌తోనే తెలుగులో మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఆశపడుతోందట అందాల హనీ రోజ్. కష్టపడి తెలుగు కూడా నేర్చేసుకుంది.

Also Read: ప్రభాస్‌తో కృతి సనన్ ఎంగేజ్మెంట్.! జర ఒప్పేసుకోరాదే.!

‘వీర సింహారెడ్డి’ సినిమా ప్రమోషన్లలో చక్కగా తెలుగులో మాట్లాడి ముద్దు ముద్దుగా తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టేసింది. అన్నట్లు బాలయ్య సినిమాలోనే హనీ రోజ్ మరో ఛాన్స్ కొట్టేసిందన్న ప్రచారం కూడా జరుగుతోంది.

అవును మరి, ‘వీర సింహారెడ్డి’ ప్రమోషన్ల టైమ్‌లో బాలయ్యతో హనీ రోజ్ చేసిన సందడి అంతా ఇంతా కాదుగా.! ఆ మాత్రం వుంటుందెలెండి.

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group