Pawan Kalyan Balakrishna Friendship.. పవన్ కళ్యాణ్ వర్సెస్ బాలకృష్ణ కాదు.! పవన్ కళ్యాణ్ మరియు బాలకృష్ణ. ఔను, ఈక్వేషన్స్ మారాయ్.! కాదు కాుద, మారాల్సిందే.!
ఇకనైనా మారండ్రా.. అన్నట్టుగా ‘ఆహా’ వేదికగా జరిగిన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో ద్వారా అటు నందమూరి బాలకృష్ణ, ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ అభిమానులకు స్పష్టమైన సంకేతం పంపారు.
హీరోలు మారారు.! కాదు కాదు, వాళ్ళెప్పుడూ ఒకేలా వున్నారు. అభిమానులే మారాలి. మారి తీరాల్సిందే.!
Pawan Kalyan Balakrishna Friendship.. స్నేహమంటే ఇదేరా..
‘మనం ముప్ఫయ్యేళ్ళ క్రితం కలుసుకుని వుండాల్సింది.. ఈ స్నేహం అప్పుడే ప్రారంభమయి వుండేది..’ అని నందమూరి బాలకృష్ణ, ఆప్యాయంగా పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకుని చెప్పారు.
‘మనిద్దరం కలిసి మల్టీస్టారర్ చేద్దాం.. 2024లో చేసేద్దాం..’ అని బాలయ్య అంటే, ‘కథ సిద్ధం.. ఇప్పుడే చెప్పెయ్యనా.?’ అంటూ దర్శకుడు క్రిష్ చెప్పడం చూస్తోంటే, వ్యవహారం మంచి జోరు మీదున్నట్లే కనిపిస్తోంది.
Mudra369
ఇది కదా, అసలు సిసలు ‘కిక్కు’ అంటే.! నందమూరి వర్సెస్ మెగా.. కమ్మ వర్సెస్ కాపు.. ఇలా జరిగే చెత్త ‘అభిమాన గొడవలు’ ఇక ఇక్కడితో చచ్చిపోవాలంతే.!
సినిమాల గురించీ, రాజకీయాల గురించీ.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), బాలకృష్ణ (Nandamuri Bala Krishna) మాట్లాడుకున్నారు. చర్చించుకున్నారు.
పుస్తక పఠనంపై పవన్ కళ్యాణ్ ఆసక్తిని బాలకృష్ణ మెచ్చుకున్నారు.
మహనీయుల అడుగు జాడల్లో ప్రజా చైతన్యం కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయ పోరాటాన్ని అభినందించారు బాలకృష్ణ.
నిజానికి, ఆయా అంశాల పట్ల తనదైన అవగాహనతో బాలకృష్ణని పవన్ కళ్యాణ్ ఆశ్చర్యపరిచారనడం సబబేమో.!
ముఖ్యమైన విషయాల్ని పవన్ చెబుతున్న సమయంలో, బాలకృష్ణ ఓ విద్యార్థిలా మారిపోయారనడం అతిశయోక్తి కాదు.
Mudra369
నిజానికి, ఇదేదో టాక్ షో అన్న విషయాన్నే చాలామంది మర్చిపోయారు. అంతకు మించి.. ఇద్దరు మిత్రులు.. అన్నదమ్ములు ఆప్యాయంగా మాట్లాడుకున్నట్టే వుంది.
Also Read: ఔనూ.! చిరంజీవిని కోడిగుడ్లతో ఎందుకు కొట్టారు.?
‘బాలకృష్ణగారి సినిమాలు హిట్టవ్వాలని మా కుటుంబంలో ప్రతి ఒక్కరం కోరుకున్నాం. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. రాజకీయాల్లో అయినా అభిప్రాయ బేధాలు మాత్రమే వుంటాయ్..’ అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
‘నీ సంకల్పం గొప్పది. రాజకీయాలు, సినిమాలు.. ఈ రెండు పడవలపై నీ ప్రయాణం గొప్పగా సాగుతుంది..’ అని బాలయ్య వ్యాఖ్యానించడం గమనార్హం.