Nikki Tamboli Wedding.. ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమా గుర్తుందా.? ఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నిక్కీ తంబోలి.!
తెలుగులో ఆ తర్వాత ఒకటీ అరా సినిమాల్లో నటించిందిగానీ, పెద్దగా సక్సెస్ కాలేదు.
సినిమాల సంగతి పక్కన పెడితే, నిక్కీ తంబోలీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్. ఆమెకంటే, ఆమె అభిమానులు ఇంకా యాక్టివ్.!
Nikki Tamboli Wedding.. బిగ్ బాస్ సంచలనం..
బిగ్ బాస్ హిందీ రియాల్టీ షో కారణంగా నిక్కీ తంబోలి ఎక్కువ పాపులర్ అయ్యింది. ఆ పాపులారిటీ కారణంగానే ఆమెకు బోల్డంత ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

ఆ అభిమానుల్ని యాక్టివ్‌గా వుంచే క్రమంలో హాట్ అండ్ వైల్డ్ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.
బికినీ దగ్గర్నుంచి.. అందాల ఆరబోతకి ఏ కాస్ట్యూమ్స్ అయితే అనువుగా వుంటాయో.. అలాంటి వాటినే ఎంచుకుంటుంటుంది నిక్కీ తంబోలి.
కాస్త కొత్తగా..
ఔను, కాస్త కొత్తగా ట్రై చేసినట్టుంది. ట్రెడిషనల్ వేర్‌లోనూ అల్ట్రా మోడ్రన్ లుక్‌లో ఇదిగో.. ఇలా మెరిసిపోతోంది నిక్కీ తంబోలి. ఇదంతా వెడ్డింగ్ జ్యుయెలరీ ప్రమోషన్ కోసమే లెండి.!
కాదేదీ కవితకనర్హం అన్నాడో పెద్దాయన. కాదేదీ అందాల ప్రదర్శనకు అనర్హం.. అంటుంటారు అందాల భామలు. కనిపిస్తోంది కదా.. అందాల జాతర.!
Also Read: Raveena Tandon: వృద్ధ నారీ పతివ్రతః.!
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే.. ఏ కాస్ట్యూమ్‌లో అయినా, నిక్కీ తంబోలీ (Nikki Tamboli) అందం.. జస్ట్ స్టన్నింగ్ అంతే.!
అన్నట్టు, వెడ్డింగ్ కాన్సెప్ట్‌లో పొటోలకు జ్యుయెలరీతో నిక్కీ తంబోలీ పోజులిస్తే.. ‘పెళ్ళి కళ వచ్చేసిందే బాలా..’ అంటూ ఆమెని చూసి పాటలు పాడుకుంటున్నారు అభిమానులు.!