Nayanthara Angry On Ajithkumar లైకా సంస్థ తెరకెక్కించాల్సిన ఓ ప్రెస్టీజియస్ వెంచర్ అయోమయంలో పడింది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో అజిత్ కుమార్, నయనతార జంటగా తెరకెక్కాల్సిన సినిమా అది.
ఈ ప్రాజెక్టు నుంచి విగ్నేష్ శివన్‌ని తప్పిస్తూ లైకా సంస్థ నిర్ణయం తీసుకుంది. కాదు కాదు, ఆ ప్రాజెక్టు నుంచి విఘ్నేష్ శివన్ తనంతట తాను తప్పుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఇందులో ఏది నిజం.? అన్నది వేరే చర్చ. ఇంతకీ, అజిత్ – నయనతార కలిసి నటిస్తున్నారా.? లేదా.? వేరే దర్శకుడెవరైనా ఈ ప్రాజెక్టుని టేకప్ చేస్తున్నారా.? లేదా.?
Nayanthara Angry On Ajithkumar నయనతార అలిగిందట.. బుంగమూతి పెట్టిందట.!
తన భర్తను ఆ ప్రాజెక్టు నుంచి తప్పించడంపై నయనతార గుస్సా అవుతోందంటూ కోలీవుడ్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

‘ఇకపై అజిత్ కుమార్‌తో కలిసి ఏ సినిమా కూడా చేయకూడదని నయనతార తీర్మానించుకుంది..’ అంటూ కథనాలు గుప్పుమంటున్నాయి.
అజిత్ కుమార్ మీద అలిగితే నయనతారకు వచ్చే లాభమేంటి.? అజిత్ కుమార్ అనే స్టార్ హీరోకి వచ్చే నష్టమేంటి.?
హీరోయిన్‌తో పనేంటి.?
అజిత్ హీరోగా ఇటీవల ‘తునివు’ అనే సినిమా వచ్చింది. తెలుగులో ‘తెగింపు’ పేరుతో డబ్ అయ్యింది. అందులో హీరోయిన్ లేదు. అసలు అజిత్ సినిమాలకి హీరోయిన్ల గ్లామర్‌తో పనే లేదు.
అన్నట్టు, విగ్నేష్ శివన్ దర్శకుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా. ఇక, అజిత్ – నయనతార గతంలో సినిమాలు చేశారు. భవిష్యత్తులో చేస్తారా.? లేదా.? అన్నది మాత్రం ప్రస్తుతానికైతే సస్పెన్సే.