కియారా అద్వానీకి ‘గేమ్ ఛేంజర్’ బర్త్ డే విషెస్.!

 కియారా అద్వానీకి ‘గేమ్ ఛేంజర్’ బర్త్ డే విషెస్.!

Kiara Advani Game Changer

Hbd Gamechanger Kiara Advani.. తొలి తెలుగు సినిమాతోనే సూపర్ హిట్ కొట్టింది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. అదే ‘భరత్ అనే నేను’. మహేష్‌బాబు ఈ సినిమాలో హీరో.

ఇక, రెండో సినిమా రామ్ చరణ్‌తో (Global Star Ram Charan) చేసింది. అదే ‘వినయ విధేయ రామ’. డిజాస్టర్‌గా నిలిచింది ‘వినయ విధేయ రామ’.!

కానీ, డిజాస్టర్ అయినప్పటికీ సంక్రాంతి సీజన్‌ని క్యాష్ చేసుకుని, వసూళ్ళను బాగానే రాబట్టింది ‘వినయ విధేయ రామ’. ఇదో విచిత్రం.!

Kiara Advani Game Changer.. ముచ్చటగా మూడోస్సారి..

ముచ్చటగా మూడో తెలుగు సినిమా కియారా అద్వానీ నుంచి రాబోతోంది. అదే ‘గేమ్ ఛేంజర్’. డిసెంబర్‌లో సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయ్.

‘భారతీయుడు-2’ డిజాస్టర్ నేపథ్యంలో శంకర్ తదుపరి సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) విషయంలో కొన్ని అనుమానాలైతే అలాగే వున్నాయ్.

రామ్ చరణ్ (Global Star Ram Charan) నుంచి కూడా చూస్తే, ‘ఆచార్య’ తర్వాత విడుదలవుతున్న సినిమా ఈ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) అనే అనుకోవాలి.

అయినాగానీ, ‘గేమ్ ఛేంజర్’ మీద అంచనాలు ఓ రేంజ్‌లో వున్నాయ్. అయితే, ఆ అంచనాలకు తగ్గట్టు సినిమా ప్రమోషన్లు షురూ అవలేదు.

తాజాగా, ‘గేమ్ ఛేంజర్’ నుంచి, ఇదిగో ఈ పోస్టర్ అయితే బయటకు వచ్చింది. హీరోయిన్ కియారా అద్వానీకి (Happy Birthday Kiara Advani) బర్త్ డే విషెస్ చెబుతూ చిత్ర యూనిట్ ఈ పోస్టర్ విడుదల చేసింది.

Digiqole Ad

Related post