Anasuya Bharadwaj.. అనసూయ భరద్వాజ్.. ఈ పేరే ఓ సంచలనం.!
న్యూస్ రీడర్.. జబర్దస్త్ యాంకర్.. అంతేనా.? వెండితెరపై ‘రంగస్థలం’, ‘పుష్ప’ తదితర సినిమాలతో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది.
శశాంక్ భరద్వాజ్‌ని పెళ్ళాడిన అనసూయకి ఇద్దరు పిల్లలు.! ‘ఇద్దరు పిల్లల తల్లివి.. అయినా, ఆ పొట్టి డ్రెస్సులేంటి.?’ అని బోల్డంత ట్రోలింగ్ జరుగుతుంటుంది.
కానీ, అనసూయ ‘తగ్గేదే లే’ అంటూ తన ‘గ్లామర్ షో’ని కొనసాగిస్తూనే వుంది. ప్రస్తుతం ‘పుష్ప ది రూల్’ సినిమాలో నటిస్తోంది అనసూయ.
Anasuya Bharadwaj.. సినిమా కెరీర్.. సాఫీగానే.!
తెలుగులోనే కాదు, తమిళ సినీ పరిశ్రమ నుంచీ అనసూయకి అవకాశాలు వస్తున్నాయ్. బాలీవుడ్‌కీ వెళ్ళే ఆలోచనలో వుంది అనసూయ.
నటిగా తన సక్సెస్‌ఫుల్ కెరీర్ వెనుక.. తన భర్త ప్రోత్సాహం చాలా వుందని అనసూయ తరచూ చెబుతుంటుంది.

తాజాగా అనసూయ, తన భర్తతో కలిసి వున్న ఫొటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అదీ, వాలంటైన్స్ డే స్పెషల్‌గా. అన్నట్టు అనసూయ – శశాంక్.. ప్రేమించి పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే కదా.!
Also Read: నా భర్త విడాకులకి నేను కారణం కాదు: ఈ కెలుకుడేల హన్సిక.?
‘నీతో జీవితం.. క్రేజీయెస్ట్ రోలర్ కోస్టర్ రైడ్..’ అంటూ పేర్కొంది అనసూయ భరద్వాజ్ తన భర్త శశాంక్ భరద్వాజ్‌ని ఉద్దేశించి.
సహజంగానే, ఈ ఫొటోపైనా ట్రోలింగ్ జరుగుతోంది. ‘ఆ పొట్టి నిక్కరేంటి.?’ అంటూ అనసూయని ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్‌తో అనసూయకి పోయేదేం లేదు సరికదా, బోనస్‌గా ఫ్రీ పబ్లిసిటీ వస్తుందంతే.
ఏమో, ఈ ట్రోలింగ్‌పై ఇంకోసారి అనసూయ పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటుందేమో కూడా.!