Allu Arjun Shahrukh Jawan.. ‘బాహుబలి’ దెబ్బకి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. అన్న బౌండరీస్ చెరిగిపోయాయ్.! ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది.
‘పుష్ప ది రైజ్’ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న అల్లు అర్జున్, తొలిసారిగా ఓ బాలీవుడ్ సినిమాలో నటించబోతున్నాడట.
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌తో కోలీవుడ్ దర్శకుడు అట్లీ తెరకెక్కించనున్న ‘జవాన్’ సినిమా కోసం అల్లు అర్జున్‌తో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Allu Arjun Shahrukh Jawan.. రామ్ చరణ్‌తో మల్టీస్టారర్ చేస్తానన్నాడు కదా.?
గతంలో షారుక్ ఖాన్ ఏ టాలీవుడ్ హీరోతో మల్టీస్టారర్ చేయాలని వుంది.? అనడిగితే, ‘రామ్ చరణ్ అంటే నాకు చాలా ఇష్టం.. ఆయనతో మల్టీస్టారర్ సినిమా చేయాలని వుంది..’ అని సమాధానమిచ్చాడు కింగ్ ఖాన్.!
కానీ, ఇప్పుడు అనూహ్యంగా అల్లు అర్జున్ పేరు తెరపైకొచ్చింది. అయితే, ఈ విషయమై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
Also Read: Malavika Mohanan: ‘అందం’ గురించి అమ్మ అలా చెప్పిందట.!
బాలీవుడ్ సినిమాల్లో టాలీవుడ్ నటులు నటించడం.. టాలీవుడ్ సినిమాల్లో బాలీవుడ్ నటులు నటించడం కొత్తేమీ కాదు.
కాకపోతే, ఇప్పుడు ట్రెండ్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌గా మారింది. తమ తమ సినిమాలకు అదనపు రీచ్ తెచ్చుకునే క్రమంలో స్టార్ హీరోలు ఇతర భాషల్లోని స్టార్ హీరోలను రప్పించుకుంటున్నారు.