Renu Desai Health.. సినీ నటి రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. గత కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతోందిట.
గుండె సంబంధిత అనారోగ్య సమస్యతోపాటు, మరికొన్ని అనారోగ్య సమస్యలతోనూ తాను బాధపడుతున్నట్లు రేణు దేశాయ్ వెల్లడించడంతో అంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.
రేణు దేశాయ్ ఇటీవల తన కుమార్తెతో కలిసి మంచు కొండల్లో విహరించి వచ్చిన సంగతి తెలిసిందే.
ఇంతలోనే రేణు దేశాయ్ తాను అనారోగ్య సమస్యతో బాధపడుతున్నానని పేర్కొనడం అందర్నీ షాక్‌కి గురిచేసింది. అయితే, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు ఆమె వెల్లడించింది.
త్వరలో తిరిగి షూటింగ్ కార్యకలాపాలకీ హాజరువతానని అంటోంది రేణు దేశాయ్.
Renu Desai Health అసలేమైంది రేణు దేశాయ్‌కి.?
సినీ నటుడు పవన్ కళ్యాణ్తో కొన్నాళ్ళు సహజీవనం చేసిన రేణు దేశాయ్, ఆ తర్వాత ఆయన్ని వివాహం చేసుకుంది. ఇరువురికీ సంప్రదాయ బద్ధంగా వివాహం జరిగింది కూడా.
పవన్ – రేణు దంపతులకు అకిరానందన్, ఆద్య అనే ఇద్దరు సంతానం. అయితే, కొన్నాళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ విడాకులు తీసుకున్నారు.

అన్నట్టు, సినిమాల మీద మక్కువతో ఓ సినిమాని ఆమె నిర్మించారు, ఓ సినిమాకి దర్శకత్వం వహించారు కూడా. అయితే అవి తెలుగు సినిమాలు కావు.
Also Read: Malavika Mohanan: సూపర్ స్టార్ ముందు ‘లేడీ’ తోక ఎందుకు.?
ప్రస్తుతం తెలుగులో మళ్ళీ నటిగా ప్రయత్నాలు చేస్తున్నారామె. ఓ సినిమాలో నటిస్తున్నారు కూడా.
కాగా, రేణు దేశాయ్ తాను అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొనడంతో, ‘గెట్ వెల్ సూన్’ అంటూ అభిమానుల నుంచి కామెంట్స్ పోటెత్తుతున్నాయ్.
అనారోగ్య సమస్యతో బాధపడుతున్నవారికి అండగా నిలబడండి.. మానసిక ధైర్యాన్నివ్వండి.. అని రేణు దేశాయ్ పిలుపునివ్వడం గమనార్హం.
తనకు అత్యంత సన్నిహితులైన వారికి మాత్రమే తన అనారోగ్య సమస్య గురించి తెలుసని రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా వెల్లడించారు.