Shweta Basu Prasad: నిన్నెవరు ఇబ్బంది పెట్టారు.?

Shweta Basu Prasad
Shweta Basu Prasad Tollywood.. సినీ నటి శ్వేత బసు ప్రసాద్ గుర్తుందా.? ఎలా మర్చిపోగలం.? ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయింది ఈ బ్యూటీ.
ప్చ్.. ఆ ఒక్క సినిమాతోనే.! ఆ తర్వాత పెద్దగా సౌండ్ లేకుండా పోయింది.
పిట్ట కొంచెం, కూత ఘనం.. అన్న చందాన, తొలి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు పొందిన శ్వేత, ఆ తర్వాత కొన్ని వివాదాలతో తెలుగు సినిమాకి దూరమైంది.
బాలీవుడ్‌లోనూ, బెంగాలీ సినిమాల్లోనూ, కొన్ని వెబ్ సిరీస్‌లలోనూ నటించిన, నటిస్తోన్న శ్వేత బసు ప్రసాద్, తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో కొందరిపై అభాండాలు మోపింది.
Shweta Basu Prasad Tollywood.. పేర్లు చెప్పడానికెందుకు భయం.?
పేర్లు చెప్పలేదుగానీ, తన హైట్ గురించి ఓ పొడగరి హీరో అభ్యంతకర వ్యాఖ్యలు చేశాడని తాజాగా వెల్లడించింది శ్వేతా బసు ప్రసాద్.
తన హైట్ గురించీ, తన బరువు గురించీ జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తూ, తనను మానసికంగా కొందరు హీరోలు ఇబ్బంది పెట్టారన్నది శ్వేత బసు ప్రసాద్ ఆరోపణ.
తెలుగు వాడైనా, తెలుగులో సరిగ్గా మాట్లాడలేని ఓ హీరో, తన తెలుగు గురించి వంకలు పెట్టేవాడంటూ శ్వేత చేసిన ఆరోపణలు, ఫలానా హీరో గురించేనని జనం చెవులు కొరుక్కుంటున్నారు.

నిజానికి, శ్వేత బసు ప్రసాద్ అంటే డేారింగ్ అండ్ డాషింగ్.! అంతే కాదు, ఒకింత హెడ్ వెయిట్ కూడా ఎక్కువే ఆమెకి.. అంటుంటారు.
ఆ కారణంగానే, ఓ యంగ్ హీరోతో సినిమాని అప్పట్లో శ్వేత వదులుకుందని చెబుతుంటారు. హెడ్ వెయిట్ లేకపోయుంటే, శ్వేత స్టార్ హీరోయిన్ అయి వుండేదన్నది చాలామంది చెప్పేమాట.
Also Read: శ్రీలీల.! అంత అమాయకంగా ఎలా.!
సరే, గతం గతః స్టార్‌డమ్ అనేది తెలుగులో శ్వేతకి రాసిపెట్టి లేదేమో.! అది వేరే చర్చ. కానీ, ఇప్పుడు.. ఇన్నేళ్ళ తర్వాత, తన కో-స్టార్స్ మీద శ్వేత అభాండాలు వేయడమేంటో.!
పబ్లిసిటీ స్టంట్‌లో భాగంగానే శ్వేత బసు ప్రసాద్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందా.? నిజంగానే, ఆమెకు ఆ ఇబ్బందులు ఎదురయ్యాయా.?
