Naga Chaitanya మొన్నీమధ్యనే ‘నందమూరి – అక్కినేని’ రగడ చూశాం. ‘అక్కినేని.. తొక్కినేని..’ అంటూ నందమూరి బాలకృష్ణ విపరీత వ్యాఖ్యలు చేశారు.. తన స్థాయిని మరచి.!
తప్పయిపోయిందని చెప్పాల్సిందిపోయి, ‘ప్రేమ అక్కడ లేదు.. ఇక్కడ వుంది..’ అంటూ అక్కినేని కుటుంబాన్ని ఇంకా గట్టిగా కెలికేశారు నందమూరి బాలకృష్ణ. ఆయనంతే, అదో టైపు.!
ఇక, అక్కినేని నాగచైతన్య స్పందన.. అలాగే అక్కినేని అఖిల్ ట్వీట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Naga Chaitanya.. నాగచైతన్య హుందాతనం..
తాజాగా, నాగచైతన్య ఓ సినిమా ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. అక్కడ ‘స్పేస్’ తీసుకున్నాడు. నందమూరి తారకరత్న మరణం పట్ల తీవ్రంగా కలత చెందానని చెప్పాడు.
‘ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను..’ అంటూ తనతోపాటు అంతా ఒక్క నిమిషం మౌనం పాటించాలని కోరాడు అక్కినేని నాగచైతన్య.
అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘ఉగ్రం’ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
Also Read: Nandamuri Taraka Ratna: చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు.!
ఓ కుటుంబంలో అందరూ ఒకేలా వుండరు.! నందమూరి బాలకృష్ణ అలా నోరు జారారని, నందమూరి కుటుంబంతో అక్కినేని కుటుంబం వైరం పెట్టుకుంటుందా.?
ఈ విషయంలో అక్కినేని నాగచైతన్య అందరికీ నచ్చేశాడు.! నిజానికి, తారకరత్న విషయాన్ని నాగచైతన్య ప్రస్తావించకపోయినా ఎవరూ ఆక్షేపించే పరిస్థితి వుండదు.