Nithin Thammudu Movie.. నితిన్ హీరోగా తెరకెక్కిన ‘తమ్ముడు’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. చాలాకాలం తర్వాత ‘లయ’ ఈ సినిమాలో కనిపించింది.
సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ.. తదితరులు ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం. ‘వకీల్ సాబ్’ సినిమాని తెరకెక్కించిన వేణు శ్రీరామ్ ఈ ‘తమ్ముడు’ చిత్రానికి దర్శకుడు.
‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్లు గట్టిగానే చేశారు. పైగా, పవన్ కళ్యాణ్ సినిమా ‘తమ్ముడు’ టైటిల్ ఈ సినిమాకి పెట్టారాయె.!
Nithin Thammudu Movie.. ప్చ్.. తేడా కొట్టేసింది.!
సినిమా రిలీజ్‌కి కొద్ది రోజుల ముందు, పాజిటివ్ బజ్ బాగానే క్రియేట్ అయ్యింది. కానీ, సరిగ్గా అప్పుడే నిర్మాత ‘దిల్’ రాజు సోదరుడు, శిరీష్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చి, సినిమాని అయోమయంలో పడేశాడు.
‘గేమ్ ఛేంజర్’ సినిమా రిజల్ట్ గురించి మాట్లాడుతూ, సినిమా ఫ్లాపయినా హీరో రామ్ చరణ్‌గానీ, దర్శకుడు శంకర్‌గానీ తనతో మాట్లాడలేదని శిరీష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
అంతే, ‘తమ్ముడు’ సినిమాపై అప్పటిదాకా వున్న పాజిటివ్ బజ్ మొత్తం పోయింది. నిర్మాత దిల్ రాజు ఎంతగా డ్యామేజ్ కంట్రోల్ చేయాలని ప్రయత్నించినా కుదరలేదు.
సినిమాలో కంటెంట్ వుంటే..
సరే, సినిమాలో కంటెంట్ వుంటే.. ఏ వివాదమూ, సినిమా విజయాన్ని ఆపలేదనుకోండి.. అది వేరే సంగతి. కానీ, బజ్ వుంటే, ఓపెనింగ్స్ బాగా వస్తాయ్ కదా.
అస్సలేమాత్రం ఓపెనింగ్స్ కనిపించలేదు. అసలు సినిమాని ఆడియన్స్ పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు.
అన్నీ బావుండి వుంటే.. పవన్ కళ్యాణ్‌తో తనకున్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో, నితిన్.. సినిమాని పవన్ కళ్యాణ్ ద్వారా కాస్తో కూస్తో ప్రమోట్ చేయించుకునేవాడే.
Also Read: పవన్ కళ్యాణ్‌కి ‘తమిళ షాక్’.! ఇది తెగులు పైత్యం.!
దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా, పవన్ కళ్యాణ్ అభిమానే. ఆయనకీ దెబ్బ పడింది.
మొత్తంగా చూస్తే, నితిన్‌కి ఫ్లాపులు కొత్త కాదు. ఎప్పుడో ‘భీష్మ’ సినిమాతో హిట్టు కొట్టాడు నితిన్. ఆ తర్వాత మళ్ళీ హిట్టు లేదు. మళ్ళీ ఎప్పుడు హిట్ వస్తుందో తెలియదు.
కథల ఎంపికలో నితిన్ జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టం.