Ramcharan Nani Nepotism నెపోటిజం.. ఈ ప్రస్తావన చుట్టూ చాలా చాలా రచ్చ జరుగుతోంది చాలాకాలంగా.
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుట్ మరణానికి ఈ నెపోటిజం కారణమన్నది ప్రధాన ఆరోపణ.
బాలీవుడ్ నుంచి ఏ సినిమా వచ్చినాసరే ముందుగా, ‘బ్యాన్’ అనే పదం ప్రచారంలోకి వస్తోంది. సోషల్ మీడియాలో ఆయా సినిమాలకు ముందు ‘బ్యాన్’ అన్న పదాన్ని యాడ్ చేసి హ్యాష్‌ట్యాగ్స్ వదులుతున్నారు నెటిజనం.
నెపోటిజం.. వారసత్వం.! తమ వారసుల్ని సినీ రంగంలోకి తీసుకురావడం ద్వారా, కొత్త టాలెంట్‌ని తొక్కేస్తున్నారన్నది సినీ జనాలపై వున్న ప్రధాన ఆరోపణ.
ఓ డాక్టర్ తన కొడుకు లేదా కూతుర్ని డాక్టర్ చేయాలని ఎలా అనుకుంటారో.. ఓ పోలీస్ ఎలా తన వారసుల్ని పోలీస్ సర్వీస్‌లోకి తీసుకురావాలనుకుంటారో.. సినిమా కూడా అంతే.
Ramcharan Nani Nepotism.. వారసత్వం.. ఎందుకు నేరం.?
రాజకీయాల్లో వారసత్వం ఓకే.! అలాంటప్పుడు, సినిమాల్లో వారసత్వం ఎందుకు తప్పు.? ఆయా రంగాల్లో వారసత్వాన్ని బలవంతంగా రుద్దితే అది నేరం.!
కానీ, టాలెంట్ వుంటేనే ఏ రంగంలోనైనా రాణించగలుగుతారు తప్ప.. టాలెంట్ లేకుండా, కేవలం వారసత్వంతో ఆయా రంగాల్లో రాణించడం కష్టం.
సినిమా రంగం విషయానికొస్తే, మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు కాబట్టే పవన్ కళ్యాణ్ స్టార్ హీరో అయ్యాడనడం సబబు కాదు. అదే నిజమైతే, నాగబాబు కూడా స్టార్ హీరో అయిపోవాలి.
బాలకృష్ణ మాత్రమే స్టార్ హీరో. హరికృష్ణ స్టార్ హీరో కాదు. యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి వచ్చిన స్టార్డమ్లో పదోవంతు కూడా కళ్యాణ్‌రామ్‌కి రాలేదు.
అక్కినేని నాగార్జున తనయులు కాబట్టే, నాగచైతన్య అలాగే అఖిల్ స్టార్లయిపోయారని అనగలమా.? చెప్పుకుంటూ పోతే చాలానే కనిపిస్తాయ్.
ప్రేక్షకులే కదా ఎంకరేజ్ చేసేది.?
హీరో నాని తాజాగా ఓ టాక్ షోలో నెపోటిజం గురించిన ప్రస్తావన వస్తే, ‘దాన్ని ఎంకరేజ్ చేస్తున్నది ప్రేక్షకులే కదా’ అనేశాడు. ఇక్కడ నాని అసలు ఉద్దేశ్యం వేరేంగా వుంది.
‘చరణ్ తెరంగేట్రం చేసిన సినిమాకి కోటి మంది ప్రేక్షకులు.. నా సినిమాకి లక్ష మంది మాత్రమే ప్రేక్షకులు’ అని చెప్పాడు. ఆ డైలాగ్‌కి కొనసాగింపు వుంటుంది. వుండాలి కూడా.!
నెపోటిజం గురించిన ప్రశ్న వస్తే.. నాని సమాధానమిచ్చాడు.! నిజానికి, నాని సమాధానంలో కాంట్రవర్సీ ఏమీ లేదు.! కాకపోతే, ట్రోలర్స్‌కి ఏదో ఒక ‘మేత’ కావాలి కదా.! అందుకే, లేని బుర్రలకి పని చెప్పారు. ఇకనేం.. పెంట పెంట అయిపోతోంది.. అభిమానుల పేరుతో కొందరు సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేసేస్తున్నారు.
Mudra369
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ‘ఆరెంజ్’ లాంటి డిజాస్టర్ చేశాడు. కానీ, పుంజుకున్నాడు. ఈరోజు గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. నాని ఎలా స్టార్ హీరో అయ్యాడు.? రవితేజ ఎలా మాస్ మహరాజ్ అనిపించుకున్నాడు.?
అన్నిటికీ మించి, ఏ సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేని చిరంజీవి, ఎలా నెంబర్ వన్ హీరో అయ్యాడు.? నెపోటిజం.. మాట్లాడుకోవడానికి బాగానే వుంటుంది. కానీ, వాస్తవం వేరే.
Also Read: పవన్ కళ్యాణ్ బ్రహ్మచర్యం.! జాతీయ సమస్యే.?
వివిధ రంగాల్లో వున్నట్లే, సినీ రంగంలో కూడా కొంత నెపోటిజం వుండొచ్చు. కానీ, అది ప్రమాదకర స్థాయిలో వుందనడం సబబు కాదు.! సక్సెస్ వుంటేనే ఎవడన్నా హీరో. ఫెయిలయితే, ఎంత పెద్ద హీరో సినిమా అయినా ఒకటే.
‘ఆచార్య’ సినిమా విషయంలో రెండో రోజుకే తేలిపోయింది.. అని నిజాన్ని నిర్భయంగా చెప్పడం వెరీ వెరీ స్పెషల్ స్టార్ హీరో చిరంజీవికి మాత్రమే సాధ్యమైంది.
నెపోటిజం లేదు తొక్కా లేదు.. స్టార్ హీరో సినిమా అయినా, సరుకు లేకపోతే ఆడదిక్కడ.!