Fans Backstabbing Globalstar JrNTR ఔను.! జూనియర్ నందమూరి తారక రామారావుకి వేరే శతృవులు అవసరం లేదు. ‘అభిమానం’ ముసుగేసుకున్న కొన్ని శక్తులే, జూనియర్ ఎన్టీయార్‌ని బజారుకీడ్చేస్తున్నాయి.!
నో డౌట్.! సోకాల్డ్ అభిమానులే, జూనియర్ ఎన్టీయార్‌కి ప్రధమ శతృవులుగా మారిపోతున్నారు. జూనియర్ ఎన్టీయార్‌ని సినిమాల పరంగా దిగజార్చేయడానికి ఆ అభిమానులే శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు.
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి ప్రత్యేకమైన గౌరవం దక్కడంపై, సోకాల్డ్ జూనియర్ ఎన్టీయార్ అభిమానులు ఆగ్రహంతో రగిలిపోయారు.
అభిమానులే వెన్నుపోటుదారులైతే.!
హీరోలకి ఎక్స్‌ట్రా హీరోయిజం అద్దాల్సిన అవసరం లేదు.. అవమానించకపోతే.. అదే చాలు.!
ఫ్యాన్స్ కాదు సైకోలనే స్థాయికి అభిమానులంటే చిరాకు పుట్టకూడదు హీరోలకి..!
తమ అభిమానుల్ని చూసి హీరోలు గర్వపడాలి తప్ప.. సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏ హీరోకీ రాకూడదు.!
సభ్య సమాజం ఛీకొట్టే స్థాయికి అభిమానమెందుకు దిగజారిపోతోంది.?
Mudra369
జ్యూరీ మెంబర్స్‌ని ట్యాగ్ చేస్తూ, అభ్యంతకరమైన భాషలో తిట్టేశారు. ఇది ఇంటర్నెట్ యుగం. ఎన్టీయార్ అభిమానులు ఏమన్నారో, ట్రాన్స్‌లేట్ చేసుకుని తెలుసుకోలేరా.?
‘మీ ఖర్మ.. ఏడవండి..’ అన్నట్లుగా, ‘జూనియర్ ఎన్టీయార్‌కి (NTR Goes Global) కూడా అవార్డు వుంది..’ అని పేర్కొంది ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ టీమ్.!
Fans Backstabbing Globalstar JrNTR.. అవమానిస్తున్నది అభిమానులే..
వాస్తవానికి, రామ్ చరణ్‌తో (Global Star Ram Charan) సమాన గౌరవం జూనియర్ ఎన్టీయార్‌కి (Man Of Masses NTR) కూడా ఆ జ్యూరీ ఇచ్చింది. ఇదే విషయాన్ని రామ్ చరణ్ కూడా ప్రస్తావించాడు.
అయితే, వ్యక్తిగత కారణాల వల్ల జూనియర్ ఎన్టీయార్ అమెరికా వెళ్ళలేకపోయాడు. ‘స్పాట్‌లైట్’ పురస్కారాన్ని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌లో అందరికీ ఇచ్చారు. ఎన్టీయార్ వెళ్ళి వుంటే తీసుకునేవాడే.

రామ్ చరణ్ ఎలాగైతే అవార్డుల ప్రెజెంటర్ అయ్యాడో, అదే గౌరవం ఎన్టీయార్‌కి కూడా దక్కేది. ఎన్టీయార్ వెళ్ళలేదు కాబట్టి, రామ్ చరణ్‌కి అది డబుల్ ధమాకా అయ్యిందంతే.!
‘మై బ్రదర్..’ అని రామ్ చరణ్, ఎన్టీయార్ పిలుచుకుంటున్నా, ఎన్టీయార్ అభిమానులకే అది అర్థం కావడంలేదు. ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ వేడుకలో సున్నితంగా అభిమానుల్ని ఎన్టీయార్ హెచ్చరించాడు.
తన సినిమా అప్డేట్స్ గురించే కావొచ్చు.. మొత్తంగా పరిశ్రమలోని హీరోల అభిమానుల అత్యత్సాహం గురించి కావొచ్చు.. ఎన్టీయార్ తనదైన అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టాడు. ప్రతి హీరో చెయ్యాల్సిందే ఇది.
ఎన్టీయార్ సిగ్గుతో తలదించుకోవాల్సి రావొచ్చు..
అభిమానులు అలా తయారయ్యారు. జూనియర్ ఎన్టీయార్ (NTR Goes Global) అభిమానులు మరీనూ.!
‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీయార్ పోషించింది సైడ్ క్యారెక్టర్.. అని ముద్ర వేసింది సాక్షాత్తూ ఈ సోకాల్డ్ ఎన్టీయార్ అభిమానులే. రాజమౌళిని అప్పట్లో వీళ్ళే తిట్టిపోశారు.
Also Read: పవన్ కళ్యాణ్ బ్రహ్మచర్యం.! జాతీయ సమస్యే.?
ఇప్పుడేమో ఇలా ప్లేటు ఫిరాయించేసి.. ఏవేవో చెత్త వ్యాఖ్యలతో, ఏకంగా అంతర్జాతీయ స్థాయి అవార్డులకీ మకిలి అంటిస్తున్నారు. ఆయా జ్యూరీలకు తెలుగు సినిమాపై, ఇండియన్ సినిమాపై అసహ్యం వేసేలా చేస్తున్నారు.
మారండ్రా ఇకనైనా.! లేకపోతే, మీ చెత్త అభిమానం కారణంగా, జూనియర్ ఎన్టీయార్ (Jr NTR) అంతర్జాతీయ వేదికలపై సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి రావొచ్చు.