Samantha Ruth Prabhu Citadel హీరోయిన్ అంటే సున్నితంగా కనిపించడమే కాదు, తెరపై వీరోచిత పోరాటాలు కూడా చేయాల్సి వస్తుంది.!
సమంత గురించి కొత్తగా చెప్పేదేముంది.? ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ కోసం సమంత ఏ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ చేసేసిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అన్నట్టు, ‘యశోద’ సినిమా కోసం కూడా యాక్షన్ సీక్వెన్సెస్ అదరగొట్టేసింది. వీటి కోసం సమంత ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుందనుకోండి.. అది వేరే సంగతి.
Samantha Ruth Prabhu Citadel ప్చ్.. గాయపడిందే.!
తాజాగా, సమంత ఓ షూటింగ్ సందర్భంగా గాయపడింది. చేతలకు గాయాలైన విషయాన్ని తానే స్వయంగా వెల్లడించింది. ఎలా గాయాలయ్యాయబ్బా.? ఇప్పుడామె పరిస్థితేంటి.?
షూటింగుల్లో సెలబ్రిటీలు గాయపడటం కొత్తేమీ కాదు.!
హీరోలకు ధీటుగా వెండితెరపై యాక్షన్ ఎపిసోడ్స్‌లో సత్తా చాటుతున్న అందాల భామలు.. ఈ క్రమంలో గాయపడటం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది.!
తాజాగా ఈ లిస్టులో సమంత కూడా చేరిపోయింది.
Mudra369
అభిమానులైతే ఆందోళన చెందుతున్నారు. కానీ, అంతలా ఆందోళన చెందాల్సిన పనిలేదని సమంత టీమ్ నుంచి సమాచారం అందుతోంది.
‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ చేస్తోంది సమంత (Samantha Ruth Prabhu) ప్రస్తుతం. ఆ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలోనే సమంత గాయపడింది.

సమంత ఏం చేసినా, పెర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలోనే ‘సిటాడెల్’ కోసం ముందస్తుగా చాలా కసరత్తులు చేసింది. వర్కవుట్స్ చేసింది.. బాక్సింగ్‌లో ప్రాక్టీస్ చేసింది కూడా.
అన్నట్టు, రాజ్ – డీకే దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సిటాడెల్’లో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఓ కీలక పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
గాయాలు కాదు.. ఆభరణాలు..
సమంత (Samantha Ruth Prabhu) లాంటి డెడికేషన్ వున్న ఆర్టిస్టులకు గాయాలే ఆభరణాలంటూ ఆమె అభిమానులు కొందరు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.
Also Read: వరుణ్ తేజ్ పెళ్ళి బాజా.! లావణ్య త్రిపాఠితోనేనా.?
అయితే, ‘మయోసైటిస్’తో బాధపడుతున్న సమంత (Samantha), ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా వుండాలని ఇంకొందరు సూచిస్తున్నారు.
ఇదిలా వుంటే, సమంత నటించిన ‘శాకుంతలం’ (Shaakuntalam) విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. గుణశేఖర్ తెరకెక్కించిన ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న విడుదల కానుంది.