Khushbu Sundar.. లైంగిక వేధింపులపై స్పందించడం ఈ మధ్య సెలబ్రిటీలకు ఓ ప్యాషన్ అయిపోయింది.. అయ్యో.! తప్పుగా అర్ధం చేసుకోవద్దు సుమా.
‘మీ టూ’ వుద్యమం వచ్చాకా స్టార్ హీరోయిన్లు సైతం తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా నిర్భయంగా బయట పెట్టేస్తున్నారు.
అయితే, సీనియర్ నటి ఖుష్బూ ఇదే విషయమై తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయ్.
తన తండ్రి కారణంగానే చిన్నతనంలో తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని ఖుష్బూ ఓపెన్ అవడం సంచలనమైంది.
Khushbu Sundar.. ఆ బాధ భయానకం..
ఖుష్బు 8 ఏళ్ల వయసులో వున్నప్పుడే లైంగికంగా వేధించబడ్డారట. అది కూడా ఆమె తండ్రి చేతుల్లోనే కావడం అత్యంత బాధాకరం.
అబ్బాయి కానీ, అమ్మాయి కానీ, చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురైతే అది వారి జీవితాంతం బాధిస్తుందనీ, భయ భ్రాంతులకు గురి చేస్తుందనీ వ్యాఖ్యానించారు.
ఓ తండ్రి తన కుమార్తె మీద లైంగిక వేధింపులకు పాల్పడగలడా.?
Mudra369
కలికాలం.! ఈ మధ్య ఇలాంటి ఘటనల గురించి తరచూ వింటున్నాం.!
ఇన్నేళ్ళుగా ఎప్పుడూ తన తండ్రి గురించి ఇలా చెప్పని ఖుష్బూ, ఇప్పుడెందుకిలా చేసింది.?
ఆమె వ్యాఖ్యల వెనుక రాజకీయ కోణం ఏమైనా వుందా.?
ఇటీవలే కీలక పదవి దక్కించుకున్న ఖుష్బూ.. ఏ పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది.?
తెలిసీ తెలియని వయసులోనే కన్నతండ్రి కారణంగా తాను ఎదుర్కొన్న అనుభవాన్ని తల్లితో చెప్పుకోలేక.. తనలో తానే మధన పడిన వైనాన్ని ఓ కార్యక్రమంలో ఖుష్బూ బయట పెట్టారు.
ఆడిపిల్లల్లో చైతన్యం పెంచేందుకే.!
అయితే, 15 ఏళ్ల వయసు వచ్చేసరికి తనపై జరుగుతున్న అకృత్యాన్ని అప్పుడే ధైర్యంగా ఎదిరించానని ఖుష్బూ తెలిపారు. 16 ఏళ్ల వయసు వచ్చేసరికి తన తండ్రి తన కుటుంబాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయాడనీ చెప్పారు.
ఆ తర్వాత చాలా కష్టాలు పడ్డామని.. హీరోయిన్‌గా కెరీర్ మొదట్లో చాలా కష్టాలు పడ్డానని ఖుష్బూ తెలిపారు. తనలాంటి అనుభవం మరే ఆడపిల్లకీ రాకూడదన్నారు ఖుష్బూ.
ఆడపిల్లల్లో చైతన్యం కలిగించేందుకే ఖుష్బూ ఈ వ్యాఖ్యలు చేసి వుండొచ్చు బహుశా. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.
Also Read: ‘చిత్రం’ చెప్పే కథ.! రాసుకున్నోడికి రాసుకున్నంత.!
డేరింగ్ అండ్ డాషింగ్ లేడీగా పేరు తెచ్చుకున్న ఖుష్బూ నుంచి ఈ తరహా వ్యాఖ్యలు ఆశించలేం. కానీ, ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ కావచ్చు.. మీటూ కావచ్చు.. ఎంత ట్రెండింగ్‌లో వున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
బహుశా ఆ ట్రెండింగ్ కోసమే ఖుష్బూ ఇలా మాట్లాడి వుండొచ్చా.? లేదంటే, నిజంగానే ఆడపిల్లల్లో చైతన్యం నింపేందుకే ఇలా మాట్లాడి వుంటుందా.? అని నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
డేరింగ్ అండ్ డాషింగ్ బ్యూటీగా పేరున్న ఖుష్బూకి తమిళనాడులో అభిమానులు ఏకంగా గుడి కట్టేశారు.! కానీ, ఆమె జీవితంలో ఇంతటి బాధాకరమైన ఘటన దాగి వుందా.? అంటే, జీర్ణంచుకోవడం అంత తేలిక కాదు.!
Mudra369
నిజంగా ఎంతో బాధపడితే తప్ప ఏ కూతురూ.. కన్నతండ్రి గురించి బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసి వుండదేమో.. అంటూ ఖుష్బూపై కొందరు సానుభూతి కూడా చూపిస్తున్నారు.