Manchu Manoj Mounika Reddy సరదాగా అన్నాడో.. సీరియస్‌గానే చెప్పాడో.! విషయమైతే ఒకింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. నిజానికి, ఈ విషయంలో మంచు మనోజ్‌ని అభినందించాల్సిందే.
స్నేహితురాలికి కొత్త జీవితాన్నిచ్చాడు. అదే సమయంలో, ఆ స్నేహితురాలి కొడుక్కి తండ్రయ్యాడు కూడా.!
సినీ నటుడు మంచు మనోజ్, ఇటీవల భూమా మౌనికా రెడ్డిని పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు మనోజ్ వేరే అమ్మాయిని పెళ్ళాడాడు. మౌనికకి కూడా వేరే వ్యక్తితో పెళ్ళయ్యింది.
Manchu Manoj Mounika Reddy.. ఇద్దరి జీవితాలూ…
మనోజ్ విడాకులు తీసుకున్నాడు.. మౌనిక (Bhuma Mounika Reddy) కూడా విడాకులు తీసుకుంది. ఇప్పుడు మనోజ్, మౌనిక ఒక్కటయ్యారు వైవాహిక బంధంతో.
భూమా కుటుంబంతో సినీ నటుడు మోహన్‌బాబుకి (Mohanbabu) అత్యంత సన్నిహత సంబంధాలు వున్నాయి.
ఈ క్రమంలోనే మనోజ్ (Manchu Manoj), మౌనిక మధ్య స్నేహం కూడా వుంది. ఆ స్నేహం వల్లనేనేమో.. మౌనిక వివాహ వేడుకలో సందడి చేశాడు మనోజ్.
అనివార్య కారణాల వల్ల మౌనిక తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్నారు… అప్పటికే ఆమెకు తన మొదటి భర్త ద్వారా ఓ కొడుకున్నాడు.
ఇప్పుడా అబ్బాయి వయసు దాదాపు ఐదేళ్ళు. నాలుగేళ్ళుగా మనోజ్, మౌనిక.. కలిసి జీవించడంపై సుదీర్ఘంగా ఆలోచించారు. పెద్దల్ని ఒప్పించేందుకు ప్రయత్నించి, ఈ క్రమంలో నానా ఇబ్బందులూ పడ్డారు.
Also Read: సుస్మితా సేన్‌కి ‘హార్ట్ ఎటాక్’ రావడమేంటి.?
చివరికి పెద్దల అంగీకారంతో మనోజ్, మౌనిక పెళ్ళి చేసుకున్నారు. మౌనిక కుమారుడ్ని తన కుమారుడిగా స్వీకరించాడు మనోజ్. అంతే కాదు, ఇది దైవ నిర్ణయమని కూడా మంచు మనోజ్ చెప్పాడు.
అంతేనా, ‘కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు..’ అంటూ మనోజ్, తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధి సాక్షిగా మీడియాతో మాట్లాడుతూ చెప్పడం గమనార్హం.
ట్రోలింగ్ చేసేవాళ్ళు.. ఆ పని చేస్తూనే వుంటారనుకోండి.. అది వేరే సంగతి. అన్నట్టు, రాజకీయాలపై మంచు మనోజ్‌కి ఆసక్తి లేదట.
అయితే, రాజకీయ నేపథ్యమున్న మౌనిక గనుక రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటే, ఆమెకు తాను అండదండలందిస్తానని చెప్పాడు మంచు మనోజ్.