ఇరువురు భామల మధ్యన నలిగిపోయిన ‘ప్రిన్స్’ యావర్.!

 ఇరువురు భామల మధ్యన నలిగిపోయిన ‘ప్రిన్స్’ యావర్.!

Shobha Shetty Prince Yawar Priyanka Jain

BiggBoss Telugu Prince Yawar.. బాడీ పెంచాడుగానీ, బొత్తిగా బుర్ర లేదు.! ప్రిన్స్ యావర్‌కి ఈ మాట సరిగ్గా సూటవుతుంది. అమ్మాయిలు తెలివిగా మైండ్ గేమ్‌తో తప్పించేస్తే, బిక్కమొహం పెట్టి.. ఏడ్చాడు మరి.!

బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్‌లో ప్రిన్స్ యావర్ (Prince Yawar) పరిస్థితి విగ్రహం పుష్టి.. నైవేద్యం నష్టి.. అన్నట్లు తయారైంది.!

పవరాస్త్రకు సంబంధించిన కంటెండర్స్ లిస్టులో యావర్ (Prince Yawar) చోటైతే దక్కించుకున్నాడుగానీ, దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.

గట్టిగా అరవడం కాదు, తెలివిగా ఆలోచించాలి. అది యావర్‌కి లేదు. దాన్ని ఇద్దరు ఫిమేల్ కంటెండర్స్ పసిగట్టారు. తెలివిగా, ప్రిన్స్ యావర్‌ని పక్కకి నెట్టేశారు.

BiggBoss Telugu Prince Yawar.. ఏడ్చే మగాడ్ని నమ్మకూడదు..

ఏడ్చే మగాడ్ని నమ్మకూడదంటారు.! ఇక్కడ ప్రిన్స్ యావర్‌ని నమ్మొచ్చు. ఆయన మాత్రం ఏం చేస్తాడు పాపం.. అందరూ అలా వెన్నుపోటు పొడిచేస్తున్నారు మరి.!

Prince Yawar
Prince Yawar

రేసులో ముందుకు వెళ్ళాక.. తమకు పోటీగా సాటి ఫిమేల్ కంటెస్టెంట్ అయితే బావుంటుందని అటు ప్రియాంక, ఇటు శోభా శెట్టి ప్లాన్ చేసుకున్నారు.

ఈ ప్లాన్‌కి చిత్తయిపోయాడు ప్రిన్స్ యావర్. ఏమాత్రం యావర్ తెలివైనోడయినా, ప్రియాంకని మేనేజ్ చేసుకునేవాడే. ఎందుకంటే, ఆమె కొంత సాఫ్ట్‌గా వుంది అప్పటి వరకూ.

బిగ్ బాస్ స్క్రిప్టు..

బిగ్ బాస్ రియాల్టీ షోలో ఇలాంటి కామెడీలు మామూలే.! ఇదంతా బిగ్ బాస్ (Bigg Boss Telugu 7) స్క్రిప్ట్.

లేకపోతే, యావర్ కంటెండర్ అవడానికి నానా ఛండాలమూ చేసిన బిగ్ బాస్, ఆ తర్వాత సిల్లీగా చికెన్ తినే టాస్క్ పెట్టి.. చివరికి.. మెషీన్ బుల్‌తో మమ అనిపించేయడమేంటో.!

Also Read: ‘బేబీ’ బ్యూటీకి ఆ కళ కనిపిస్తోందిగా.!

ప్రియాంక – శోభా శెట్టి.. ఈ ఇద్దరిలో ఎవరికి పవరాస్త్ర దక్కుతుందో వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున (King Akkineni Nagarjuna) చెబుతాడట. అలాగని బిగ్ బాస్ చెబుతున్నాడు.

కామెడీ అంటే ఇదే మరి.!

Digiqole Ad

Related post