Manchu Manoj Vishnu Fighting.. గత కొంతకాలంగా మంచు సోదరుల మధ్య గొడవలున్నాయనే ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అదంతా ఉత్తదేనని మోహన్‌బాబు కొట్టి పారేశారు.
సోషల్ మీడియాలో కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ మోహన్‌బాబు మండిపడ్డారు కూడా. కానీ, అన్నదమ్ముల మధ్య గొడవలు సోషల్ మీడియాకెక్కాయి.!
అసలేం జరిగింది.? అంటే, పూర్తి వివరాలైతే బయటకు రావాల్సి వుంది. గొడవకు సంబంధించిన వీడియోను మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం గమనార్హం.
Manchu Manoj Vishnu Fighting.. విష్ణు కనిపిస్తున్నాడుగానీ..
మంచు విష్ణు అయితే గొడవపడుతున్నాడు.. అది కూడా ఓ ఇంటికి వెళ్ళి. ‘ఇదండీ సంగతి.. మా వాళ్ళ మీదా మా మీద.. దాడి చేస్తున్నారు.. ఇళ్ళ మీదకు వచ్చి గొడవ చేయడమేంటి.?’ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో మనోజ్ వాయిస్ వినిపిస్తోంది.

చూస్తోంటే, అదో మధ్యతరగతి కుటుంబం నివసిస్తున్న ఇల్లులా వుంది. ‘నువ్వు రా విష్ణూ..’ అంటూ ఎవరో మంచు విష్ణుని తీసుకెళుతున్నాడు.
‘అరేయ్.. ఒరేయ్ అంటున్నాడు వాడు..’ అంటూ మంచు విష్ణు (Manchu Vishnu), దూకుడుగా హడావిడి చేస్తున్నాడు. అసలేం జరుగుతోందక్కడ.?
మంచు మోహన్‌బాబు అంటే క్రమశిక్షణ అంటుంటారు. ఇదేనా పెంపకం.? అన్న సెటైర్లు సోషల్ మీడియా వేదికగా పడుతున్నాయ్ మరి.!
ఎందుకు గొడవ జరిగింది.?
అసలెందుకు గొడవ జరిగింది.? అన్నది మాత్రం తేలలేదు. ‘అన్నదమ్ముల మధ్య అభిప్రాయ బేధాలు సహజమే.. ఇదేమంత పెద్ద గొడవ కాదు’ అంటూ మోహన్‌బాబు (Mohanbabu) ఈ వ్యవహారంపై స్పందించారు.
ఇంటి మీదకు గొడవ చేయడానికి వెళితే అది పెద్ద సమస్య కాకపోవడమేంటి.? పైగా, మంచు మనోజ్ స్వయంగా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడాయె.!
Also Read: నిహారిక విడాకులు.! ఎవరి శాపం.! ఇదేం జర్నలిజం.?
అయితే, మోహన్‌బాబు (Manchu Mohanbabu) సూచనతో మంచు మనోజ్ సదరు వీడియోను సోషల్ మీడియా నుంచి మనోజ్ (Manchu Manoj) తొలగించినప్పటికీ, అప్పటిక వీడియో వైరల్ అయిపోయింది.
ఇటీవల మంచు మనోజ్ (Manchu Manoj) పెళ్ళి భూమా మౌనికా రెడ్డితో జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుకలోనూ విష్ణు (Manchu Vishnu) అంత సఖ్యతగా కనిపించలేదన్న ప్రచారం వుంది.
చివరగా.. ఇదంతా ప్రాంక్ అనే ప్రచారం కూడా జరుగుతోంది.! ప్రాంక్ వీడియో నిజమే అయితే, అదీ ఆక్షేపణీయమే.! అన్నదమ్ముల మధ్య ఎలాంటి గొడవలూ లేకపోతే, అంతకన్నా కావాల్సిందేముంది.?