Nandita Swetha Pink నందితా శ్వేత.! ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలో దెయ్యం పాత్ర పోషించింది ఈ అందాల బొమ్మ.
తెలుగులో తొలి సినిమానే అయినా, అప్పటికే పలు తమిళ, కన్నడ చిత్రాల్లో నటించిన అనుభవం వుంది నందిత శ్వేతకి.
సో, ఫస్ట్ మూవీ అయినా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’లో చాలా ఈజ్‌తో నటించేసింది.. విమర్శకుల ప్రశంసలూ అందుకుంది.
అంతేకాదు, ఆ పాత్రతో తెలుగు ప్రేక్షకుల మనసులు కూడా అంతే ఈజీగా దోచేసిందీ అందాల బెంగుళూరు ముద్దుగుమ్మ.

చెంపకి చారెడు కళ్లు అనే మాటకి అసలు సిసలు అర్ధం నందిత శ్వేత. అవును నిజమే, ఆ కళ్లు నందిత అందాన్ని మరింత రెట్టింపు చేసి చూపిస్తాయ్.
Nandita Swetha Pink..స్పెషల్ ట్రీట్.. పోలా.! అదిరిపోలా.!
ఏప్రిల్ ఈ అందాల భామకు బర్త్ డే మంత్ అట. సో, నెట్టింట అప్పుడే బర్త్‌డే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసేసింది నందిత శ్వేత. రోజుకో రకం కాస్ట్యూమ్స్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
ఏప్రిల్ 30న అమ్మడి బర్త్ డే కావడంతో, ఇప్పటి నుండే ఫ్యాన్స్‌లో సరికొత్త ఫాలోయింగ్ సంపాదించాలనుకుంటోంది. ఈ క్రమంలోనే పింక్ అండ్ హాట్ లుక్స్‌తో కట్టిపడేస్తోంది.
తాజాగా చిరిగిన జీన్స్ ధరించి, పింక్ కలర్ బ్రైట్ టాప్‌లో అందాలొలికిస్తూ నందిత శ్వేత (Nandita Swetha) కుర్రకారును ఊరిస్తోంది.

ఇక, సినిమాల విషయానికి వస్తే, తెలుగుతో పాటూ, తమిళ నాట కూడా చాలా బిజీగా గడుపుతోంది నందితా శ్వేత (Nandita Swetha). తెలుగులో మొదట వరుసగా దెయ్యం పాత్రలు పోషించి, ఆ పాత్రకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
Also Read: ప్రబాస్ మీద పగ తీర్చుకుంటున్న ‘ఆదిపురుష్’ టీమ్.!
ఆ తర్వాత ‘అక్షర’ వంటి హీరోయిన్ సెంట్రిక్ మూవీతోనూ సత్తా చాటింది. ప్రస్తుతం తెలుగులో ‘జెట్టీ’ అనే సినిమాలో నటిస్తోంది నందితా శ్వేత (Nandita Swetha).