Iratta Movie Review: ట్విస్ట్ అంటే ఇలా వుండాలి.!

 Iratta Movie Review: ట్విస్ట్ అంటే ఇలా వుండాలి.!

Iratta Movie Review

Iratta Movie Review.. కొన్ని సినిమాల్ని.. కేవలం సినిమాలుగా చూడలేం. నిజ జీవితంతో కనెక్ట్ చేసేసుకుంటుంటాం.! అలాంటిదే ‘ఇరాట్ట’ సినిమా కూడా.

మలయాళ సినిమా ‘ఇరాట్ట’లో జోజు జార్జ్ (జోసెఫ్ జార్జ్) కథానాయకుడు. ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమాలో మన తెలుగు ప్రేక్షకులకు తెలిసింది ఒకే ఒక్క మొహం.. ఆ మొహం ఎవరో కాదు, పదహారణాల తెలుగమ్మాయ్ అంజలి.

నిజానికి, అంజలిది (Actress Anjali) సినిమాలో చాలా చాలా చిన్న రోల్. కానీ, ఆ పాత్ర ఇంపాక్ట్ గట్టిగానే వుంటుంది సినిమా మీద.

హత్య కేసు విచారణ..

ఓ హత్య కేసు విచారణ సందర్భంగా కొత్త కోణాలు బయటపడుతుంటాయి. అనుమానితుల్ని ప్రశ్నిస్తున్నకొద్దీ.. కథలో ఉత్కంఠ పెరుగుతుంటుంది.

పోలీస్ అధికారి, పోలీస్ స్టేషన్‌లో ఎలా చనిపోయాడు.? అన్నది అసలు పాయింట్. చివరికి అది ఆత్మహత్య అని తేలుతుంది. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్నది మిగతా కథ.

కొన్ని సినిమాలు మనసుకి హత్తుకునేలా వుంటాయ్..

వాటిల్లో కొన్ని గుండె లోతుల్లోకి మరింత బలంగా వెళ్ళిపోతాయ్..

అందులోనూ ఇంకొన్ని గుండెల్ని పిండేస్తాయ్..

వాటిల్లో మళ్ళీ కొన్ని మాత్రమే.. సినిమా పూర్తయ్యాక కూడా మనల్ని వెంటాడతాయ్.!

‘ఇరాట్ట’ సినిమా చూశాక.. చాన్నాళ్ళపాటు అందులోని ప్లాట్ మనల్ని ఖచ్చితంగా వెంటాడుతుంది..

అసలు ఇలా ఎలా జరుగుతుంది.? ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది.? అన్న ప్రశ్న మనల్ని వేధిస్తుంటుంది.!

Mudra369

జోజు జార్జ్ ఈ సినిమాలో (Iratta Telugu Review) ద్విపాత్రాభినయం చేశాడు. ఇద్దరూ (కవలలు) పోలీస్ అధికారులే. ఒకరేమో డీఎస్‌పీ, ఇంకొకరేమో ఏఎస్ఐ.

సోదరుడి మిస్టీరియస్ డెత్ కేసులో అనుమానితుడిగా మారిన సోదరుడే, మిస్టరీని ఛేదించేందుకు నడుం బిగిస్తాడు. చివరికి నిజాన్ని బయటకు తీస్తాడు.

కాకపోతే, ఆ నిజాన్ని జీర్ణించుకోవడం చాలా చాలా కష్టం. సినిమా చూశాక ఆ నిజం మనల్ని వెంటాడుతుంటుంది. ఇలాక్కూడా జరుగుతుందా.? ఇలాంటోళ్ళూ సమాజంలో వున్నారా.? అనిపిస్తుంది.

Iratta Movie Review.. నెమ్మదిగా మొదలై..

మలయాళ సినిమాలు సహజంగానే నెమ్మదిగా వుంటాయి. అదే సమయంలో వాటిల్లో సహజత్వం ఎక్కువ. నాటకీయత చాలా చాలా తక్కువగా వుంటుంది. సినిమా మొదలైన కాస్సేపటికి సాగతీత అనిపిస్తుంది.

కానీ, సమయం గడిచేకొద్దీ కథలో లీనమైపోతాం. అంత బారెడు పొట్టేసుకుని.. పోలీస్ అధికారులేంటి.? వాళ్ళే కథానాయకులేంటి.? అన్న సందేహం మన తెలుగు ప్రేక్షకులకు కలగొచ్చు.

అయితే, తెరపై ఆయా పాత్రలే కనిపిస్తాయి తప్ప.. వాటిల్లోని నటులెవరన్నది (Iratta Movie Telugu Review) కాస్సేపటికే మర్చిపోతాం. అంతలా ఆయా పాత్రల్లో ఒదిగిపోయాడు జోజు జార్జ్ (Joju George).

అన్నట్టు, జోజు జార్జ్‌ని (Joju George) త్వరలో తెలుగు తెరపై చూడబోతున్నాం. సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందబోతున్న తాజా చిత్రంలో ఈయనే విలన్.

సింపుల్.. బట్ స్టన్నింగ్..

సినిమాటోగ్రఫీ చాలా చాలా బావుంది. ఎడిటింగ్ క్రిస్పీగానే (Iratta Review) వుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా ఇదొక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్.

Also Read: రామ్ చరణ్ ఆస్కార్.! చిరంజీవి పుత్రోత్సాహం.!

దీన్నొక ప్రయోగాత్మక చిత్రంగా చూడొచ్చు. ఇలాంటి సినిమాలు స్ట్రెయిట్‌గా తెలుగులోనూ వస్తే బావుణ్ణనిపిస్తుంటుంది. అదే మలయాళ సినిమాల ప్రత్యేకత.

Digiqole Ad

Related post