Adipurush Hanuman.. ఏమయ్యింది ‘ఆదిపురుష్’ సినిమాకి.? ఇంతలా ఎందుకు ఈ సినిమాపై విమర్శలు వస్తూ వచ్చాయి.?
ప్రభాస్, కృతి సనన్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ ఫిలిం మేకర్ ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న పాన్ ఇండియా సినిమా ఇది.!
‘ఆదిపురుష్’ నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ఏ పోస్టర్ కూడా అంచనాల్ని అందుకోలేకపోయింది. వీడియో ప్రోమోస్ కూడా అంతే.
ఆ గెటప్పులేంటి.? ఆ వీఎఫ్ఎక్స్ ఏంటి.? అని విమర్శలు వచ్చాయి. కానీ, ఈసారి మాత్రం అలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా పోయింది.
Adipurush Hanuman హనుమంతుడొచ్చాడు..
తాజాగా, ‘హనుమాన్ జయంతి’ నేపథ్యంలో ‘ఆదిపురుష్’ టీమ్ ఓ పోస్టర్ విడుదల చేసింది. బ్యాక్గ్రౌండ్లో ప్రభాస్ కనిపిస్తుండగా, ఫుల్ పిక్చర్ మాత్రం ఆంజనేయుడి పాత్రధారిదే.
హనుమంతుడు ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్.. ఇప్పటిదాకా వచ్చిన ‘ఆదిపురుష్’ ప్రమోలన్నిటికంటే టాప్ క్లాస్ అని చెప్పొచ్చు.
అన్నట్టు, గతంలో రివీల్ చేసిన ఫొటోలు, వీడియోల్లో హనుమంతుడి పాత్రపై చాలా చాలా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.