Janasenani Pawan Kalyan జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే వైసీపీ వ్యతిరేక ఓటు గురించి మాట్లాడుతున్నారు.!
‘వైసీపీ (YSR Congress Party) వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అంటూ గతంలో (జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేదికపై) చేసిన వ్యాఖ్యల దగ్గర్నుంచి ఈ కథ మొదలైంది.
అసలు వైసీపీ (YSRCP) వ్యతిరేక ఓటు అంటే ఏంటి.? ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు అనుకోవాలా.? వైఎస్సార్సీపీ హయాంలోని ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా పరిగణించాలా.?
పులుసు ఒకటి.. అందులోని బద్ద ఒకటి.. అనడానికి వీల్లేదు. రెండూ దాదాపు ఒకటే. అయితే, వైసీపీ వ్యతిరేక ఓటుని విపక్షాల్లో ఏది ఎంత క్యాష్ చేసుకుంటుంది.? అన్నది ఎన్నికల్లో తేలుతుంది.
Janasenani Pawan Kalyan .. అధికార పార్టీకే అడ్వాంటేజ్..
అధికారంలో వున్న పార్టీకి సంబంధించిన వ్యతిరేక ఓటుని విపక్షాలు విడివిడిగా పంచుకుంటే, అప్పుడు ఆటోమేటిక్‌గా అది అధికార పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందన్నది ఓ రాజకీయ సమీకరణం.
కానీ, అన్ని సందర్భాల్లోనూ అలా జరగాలని లేదు. అధికార పార్టీ వ్యతిరేక ఓటు ఓ పార్టీ వైపు బదలాయింపు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనేముంది.?
వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చనివ్వకపోవడమంటే.. దాన్ని యధాతథంగా జనసేన వైపుకు మళ్ళించే ఉద్దేశ్యం కూడా కావొచ్చు.!
పొత్తులు ఖరారైతే.. ఆ వైసీపీ వ్యతిరేక ఓటుని పంచుకోవడంతోపాటు, పరస్పర సహకారం, ఓట్ల బదలాయింపు.. ఇలాంటివి వుంటాయ్.!
రాజకీయ పరిపక్వత లేనోళ్ళే ‘దత్తత’ విమర్శలు చేస్తారు.! రాజకీయాల్లో ఇది సహజం.!
ప్రజల్లో తమకు సంపూర్ణ బలం వుందని చెబుతున్నప్పుడు, వ్యతిరేక ఓటుపై వైసీపీ ఆందోళన చెందాల్సిన పనేముంది.?
Mudra369
సో, ఇక్కడ జనసేన అధినేత (Janasena Chief Pawan kalyan) చేస్తున్న ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అన మాట వెనుక రెండు కోణాలు వుండొచ్చు.
ఆ వ్యతిరేక ఓటునంతటినీ జనసేన (Jana Sena Party) వైపు బదలాయిస్తామనో, జనసేన – బీజేపీ కూటమి వైపు మళ్ళించుకోగలుగుతామనో భావన వుందని అర్థం చేసుకోవాలి.
రాజకీయాల్లో కట్ అండ్ పేస్ట్ వ్యవహారాలు ఎక్కువైపోయాయి. కుహనా మేధావుల సంగతి సరే సరి.
వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్.. ఇలా సోషల్ మేధావులూ కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చేశారు. అదే అసలు సమస్య.!
వైసీపీ పట్ల ఎంతటి వ్యతిరేకత వుంది.?
సరే, వైసీపీ పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత వుంది.? అన్నది వేరే చర్చ. వై నాట్ 175 అంటోంది వైసీపీ. ఆ ధీమా ఆ పార్టీ అధినేతలో స్పష్టంగా కనిపిస్తోంది కూడా.
కానీ, ఎంత గొప్ప ప్రభుత్వానికైనా ఖచ్చితంగా వ్యతిరేక ఓటు అనేది వుండి తీరుతుంది. దాన్నే, జనసేన పూర్తిగా క్యాష్ చేసుకోవాలనుకుంటోంది. ఇందులో వింతేముంది.
Also Read: పొలిటికల్ ఎంవోయూ.! నిజం.. నేతి బీరకాయ్.!
మిత్ర పక్షం గనుక, బీజేపీతో (Bharatiya Janata Party) కూడా ఆ వ్యతిరేక ఓటుని పంచుకోవాలని జనసేనాని ఆలోచిస్తే, దాన్ని తప్పు పట్టాల్సిన పనేముంది.?
వాస్తవానికి వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ చెప్పడమంటే, అందులో టీడీపీని కూడా కలుపుకున్నట్లే.. అంటూ ‘దత్తత’ ఆరోపణలు చేయడం హేయం.. అభద్రతాభావానికి అది సంకేతం.!