Guess Who Aishwarya.. ఘల్లు ఘల్లు ‘గాజుల’ సింగారమా.. తందనాన తానా.! ఎవరు ఎవరు ఈ అందాల ఐశ్వర్యమా.. తందనాన తాన.! నిండైన దుస్తుల్లో కళ్లు చెదిరే అందంతో మెరిసిపోతున్న ఈ ఐశ్వర్యం ఎవరా.? అని ఆలోచిస్తున్నారా.?
ఓ మలయాళ సుందరి, టాలెంట్ వున్న నటి. ఈ మధ్యనే తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి ఆదరణ దక్కించుకుంటోంది.
మొన్నామధ్య ఓ తెలుగు ఓటీటీ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఆ తర్వాత కొన్ని డబ్బింగ్ సినిమాల్లోనూ తన నటనతో కట్టి పడేస్తోంది.
కంటెంట్ బేస్ మూవీస్‌తో పాటూ, తన పాత్రకు కూడా ప్రాధాన్యత వుండేలా చూసుకుంటుంది ఈ అందాల బొమ్మ. ఇంతకీ ఎవరీ అందాల బొమ్మ.!
Guess Who Aishwarya.. మోము దాచేసి, ముద్దుగా కవ్వించేసి..
ఐశ్వర్య లక్ష్మి తెలుగులో నటించిన ‘అమ్ము’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘గార్గి’ తదితర తమిళ చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించిందీ మలయాళ ముద్దుగుమ్మ.

లేటెస్ట్‌గా ‘పొన్నియన్ సెల్వన్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఆశించిన స్థాయి విజయం అందుకోకపోయినా, రెండు పార్టుల్లోనూ ఐశ్వర్య లక్ష్మి గుర్తుండిపోయే పాత్రలతో మెప్పించింది.
Dimple Hayathi.. ‘వల్గారిటీ’ అనగానే పాపకి కోపమొచ్చింది.!
సోషల్ మీడియాలోనూ ఐశ్వర్య లక్ష్మికి మంచి ఫాలోయింగ్ వుంది. ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా వున్నప్పటికీ అప్పుడప్పుడూ కాన్సెప్ట్ బేస్డ్ ఫోటో సెషన్లతో ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lekshmi) తన ఫాలోవర్స్‌కి స్పెషల్ కిక్ ఇస్తుంటుంది.
ఆ కోవలోకి చెందినవే ఈ తాజా పిక్స్. ట్రెడిషనల్ లుక్స్‌లో ముఖం దాచేసి ఇదిగో ఇలా మురిపిస్తోంది. చేతి నిండా గాజులతో, చెవులకి పెద్ద పెద్ద జుంకీలు ధరించి అందంగా కనిపిస్తోంది.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్నాయ్.