Table of Contents
Sakshi Vaidya.. తెలుగు సినిమాల్లో నటించేందుకు ఒకప్పుడు ముంబయ్ భామలు అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. కానీ, ఇప్పుడు తెలుగు సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకుంటోంది.
ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తెలుగు సినిమాల్లో నటించేందుకు బాలీవుడ్ ముద్దుగుమ్మలు క్యూ కడుతున్నారు. కొత్త భామలే కాదు, స్టార్ హీరోయిన్లు సైతం తెలుగు హీరోల సరసన నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
నటించడానికే కాదు, తెలుగులో మాట్లాడేందుకూ ప్రయత్నిస్తున్నారు. తెలుగు నేర్చుకోవడానికి, తమ పాత్రలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి కూడా వెనుకాడడం లేదు.
ఆ లిస్టులో తాజాగా అప్ కమింగ్ బాలీవుడ్ బ్యూటీ సాక్షి వైద్య (Sakshi Vaidya) చేరిపోయింది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో ‘ఏజెంట్’ సినిమాతో తెరంగేట్రం చేసింది.
Sakshi Vaidya.. మెగా కాంపౌండ్ పైనే ఆశలన్నీ..
అయితే, బోనీ అంత ఆసక్తికరంగా లేదు. తొలి సినిమా డిజాస్టర్ లిస్టులో కొట్టుకెళ్లిపోయింది. ఫస్ట్ సినిమా ఒప్పుకున్న టైమ్‌లోనే రెండో సినిమాకీ సైన్ చేసింది సాక్షి వైద్య.
అదే మెగా కాంపౌండ్ మూవీ. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) లీడ్ రోల్ పోషిస్తున్న ‘గాంఢీవధారి అర్జున’ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది.

శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే రిలీజ్‌కి సిద్ధమవుతోంది. భారీ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీగా రూపొందబోతున్న ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు డైరెక్టర్.
కాగా, ఈ సినిమాలో తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటోందట ముద్దుగుమ్మ సాక్షి వైద్య. అందుకోసం తెలుగులో అనర్గళంగా మాట్లాడేందుకు ఓ ట్యూటర్‌ని కూడా పెట్టుకుందట.
ఏజెంట్ భామ తెలుగు పలుకులు
ఆల్రెడీ డబ్బింగ్ పనులు కూడా స్టార్ట్ చేసిందట. తెలుగు భాష నేర్చుకోవడం చాలా సరదాగా వుందనీ, ఇకపై తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటున్నాననీ అంటోందీ మహారాష్ర్ట బ్యూటీ సాక్షి వైద్య.
గతంలో పూజా హెగ్దే (Pooja Hegde), రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తదితర ముద్దుగుమ్మలు కూడా కెరీర్ తొలినాళ్లలోనే తెలుగులో మాట్లాడేందుకు ఆసక్తి చూపించారు.
కొన్ని సినిమాలకు సొంత డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. ఆ కోవలోనే సాక్షి వైద్య కూడా పయనిస్తోంది కాబోలు. చూస్తుంటే అమ్మడు తెలుగులో స్టార్‌డమ్ దక్కించుకునేంతవరకూ తగ్గేదేలే అన్నట్లు కనిపిస్తోంది.
సాక్షి వైద్య ఆ విషయంలో తగ్గేదే లే.!
ఏజెంట్ ప్రమోషన్లలోనూ సాక్షి వైద్య యాక్టివ్‌గా కనిపించింది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ సంపాదించుకునే ప్రయత్నం చేస్తోంది.
ఏమో, గుర్రం ఎగరా వచ్చు. వరుణ్ తేజ్ ‘సినిమాతో లక్కు కలిసొస్తే, మెగా కాంపౌండ్ హీరోలతోనే బోలెడన్ని ఛాన్సులు కొట్టేయనూ వచ్చు.
ఇక, స్టార్‌డమ్ అంటారా.? ఒక్క సక్సెస్ కొడితే చాలు ఈ రోజుల్లో స్టార్ హీరోయిన్ ట్యాగ్ తగిలించేసుకోవడానికి. చూడాలి మరి, ఆ అదృష్టం సాక్షి వైద్య (Sakshi Vaidya)ను వరిస్తుందో లేదో.!