Ustaad Bhagat Singh PSPK బహుశా హరీష్ శంకర్ ఎదుర్కొన్నంత ఒత్తిడి ఇటీవలి కాలంలో ఇంకే ఇతర దర్శకుడూ ఎదుర్కొని వుండడేమో.!
పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అభిమానుల ఆవేదన అలాంటిది.. అందులోంచి పుట్టుకొచ్చిన అసహనం అలాంటిది. తద్వారా హరీష్ శంకర్ మీద పెరిగిన ఒత్తిడి అలాంటిది.!
అన్ని ప్రశ్నలకూ ఒకటే సమాధానం.! అదే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) పోస్టర్.! ‘ఇది చాలు.. బొమ్మ బ్లాక్‌బస్టర్’ అంటూ అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
Ustaad Bhagat Singh PSPK.. ఫస్ట్ లుక్.. ఏదో అలా క్యాజువల్‌గా.!
పవన్ కళ్యాణ్ నుంచి ఫొటో షూట్లు అవసరం లేదు.! ఎందుకంటే, ఏదో మామూలుగా ఆయన అలా నిలబడితే, అందులోంచి అదిరిపోయే స్టైలిష్ లుక్ వచ్చేస్తుంటుంది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ కూడా అంతే.! ‘ఇంతకు మించి ఇంకేముంటుంది..’ అనే స్థాయిలోనే వుందీ లుక్.!
Also Read: Sobhita Dhulipala.. నా తప్పు ఏమున్నదబ్బా.!
బ్లాక్ గాగుల్స్.. ఆ హెయిర్‌స్టైల్.. ఇవన్నీ ఓ యెత్తు.. పవన్ కళ్యాణ్ ఆటిట్యూడ్.. ‘ఆ…ట్…’ అనేలానే వుంది.
రీమేకేనా.? అసలేంటి సంగతి.?
ఇంతకీ, ఇది తమిళ సినిమా ‘తెరి’కి రీమేక్ అనుకోవచ్చా.? ఆ విషయంలోనే కొంత గందరగోళం వుంది. రీమేకేగానీ, చాలా మార్చేశారట. ఒరిజినల్ ఫిలిం అనుకోవచ్చట.
హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో గతంలో ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) వచ్చింది. ఈసారి అంతకు మించి ఎక్స్పెక్ట్ చేసెయ్యొచ్చు.

ఒక్కటి మాత్రం నిజం.. ఇప్పటిదాకా హరీష్ మీద ‘రీమేక్’ విషయమై అలకతో వున్న అభిమానులు, ఇప్పడాయన్ని ఆకాశానికెత్తేయకుండా వుండలేరు.!
ఒకే రోజు రెండు పండగలు.. ఔను, కాస్సేపట్లో ‘గ్లింప్స్’ కూడా రాబోతోంది.! గెట్ రెడీ.!
పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) మీద హరీష్ శంకర్ (Director Harish Shankar) అభిమానం.. వేరే లెవల్.! అది ‘గబ్బర్ సింగ్’తో చూసేశాం.!
ఈసారి ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు.. అంతకు మించి.. అంటున్నాడు హరీష్ శంకర్.! ఫస్ట్ లుక్‌లోనే ఆ విషయం స్పష్టమవుతోంది కూడా.!