Priyanka Chopra Jonas.. అతడి కంటే ఆమె.. వయసులో చాలా పెద్దది.! అయినా, ప్రేమకు వయసుతో పనేంటి.?
సచిన్ టెండూల్కర్ కంటే ఆయన సతీమణి అంజలి వయసులో పెద్దది.! నిజానికి, ఈ లిస్టు చాలా చాలా పెద్దదే వుంటుంది. అభిషేక్ బచ్చన్ కంటే ఐశ్వర్యారాయ్ వయసులో పెద్దదే మరి.!
అయినా, తన భర్త కంటే తాను వయసులో పెద్దదాన్నని గర్వంగా చెప్పుకుంటే.. ఆ కిక్కే వేరప్పా.!
Priyanka Chopra Jonas.. ఏడేళ్ళు.. పదిహేడేళ్ళు..
‘నేను మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకునే నాటికి నిక్ జోనాస్ వయసు జస్ట్ ఏడేళ్ళు మాత్రమే..’ అంటూ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు చేసింది.

నిక్ జోనాస్ తల్లి, ఆనాటి విషయాల్ని ప్రియాంక చోప్రాతో (Priyanka Chopra) పంచుకుందట. నిక్ తల్లిదండ్రులు, ప్రియాంక చోప్రా ‘ప్రపంచ సుందరి’ కిరీటాన్ని గెలుచుకోవడాన్ని టీవీలో తిలకించారట.
అప్పట్లో ఏడేళ్ళ వయసున్న నిక్ జోనాస్ కూడా ఆ ఘట్టాన్ని తిలకించాడట. కట్ చేస్తే, నిక్ జోనాస్ – ప్రియాంక చోప్రా ప్రేమలో పడి, పెళ్ళి చేసేసుకున్నారు.
ట్రోలింగ్ మామూలే..
‘అప్పటికి నీకేమే పదిహేడేళ్ళు.. అతడికేమో ఏడేళ్ళు.. అంత చిన్న పిల్లాడినా నువ్వు వలలో పడేసుకున్నది.?’ అంటూ ప్రియాంక మీద సరికొత్తగా ట్రోలింగ్ షురూ అయ్యింది.
Also Read: Sakshi Vaidya.. ‘ఏజెంట్’ భామ తెలుగు పలుకులు అప్పుడేనా.!
అఫ్కోర్స్.. ట్రోలింగుని పట్టించుకునే రకం కాదు ప్రియాంక చోప్రా. ఆమె, నిక్ జోనాస్‌తో ప్రేమలో పడినప్పటినుంచీ జరుగుతూనే వుందీ ట్రోలింగ్.