Table of Contents
Adah Sharma Kerala Story.. చాలా కాలంగా ఇండస్ట్రీలో వుంది. కానీ, ఇంతవరకూ సరైన గుర్తింపు దక్కలేదు. ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అని ఎదురు చూసింది. ఎట్టకేలకు ఆ ఛాన్స్ దక్కింది.
ఒక్క సినిమాతో సౌత్, నార్త్ కాదు, ఏకంగా ప్రపంచమే ఆమె గురించి మాట్లాడుకుంటోంది. ఇంతకీ ఎవరామె.? ఏంటా కథ.? అంటే వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి.
అదేనండీ, ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో కుర్రకారు హార్ట్‌లు బద్దలు కొట్టేసిన భామ ఆదా శర్మ. పూరీ జగన్నాధ్ కంపెనీ నుంచి తెలుగు తెరకు పరిచయమైన ఆధా శర్మ టాలీవుడ్లో చాలా కాలం నుంచి నటిగా కొనసాగుతోంది.
Adah Sharma The Kerala Story.. కుర్ర కారు గుండెల్లో హార్ట్ ఎటాక్.!
‘హార్ట్ ఎటాక్’ తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘క్షణం’, ‘కల్కి’ తదితర సినిమాల్లో నటించింది. అయినా అంతంత మాత్రం హీరోయిన్‌గానే మిగిలిపోయింది.
అలా అని ఆధా శర్మ ఎప్పుడూ ఖాళీగా లేదండోయ్. సినిమాల్లో తక్కువగా కనిపించినా షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్‌లు.. మ్యూజిక్ ఆల్బమ్స్ అంటూ ఏదో ఒకటి చేస్తూ ఎప్పుడూ బిజీగానే వుంది.

టాలీవుడ్లో తగినంత గుర్తింపు దక్కకపోయేసరికి బాలీవుడ్లో స్థిరపడిపోయింది. అక్కడయినా చెప్పుకోదగ్గ స్టార్డమ్ దక్కించుకుందా.? లేదా.? అనే సంగతి పక్కన పెడితే, ఇప్పుడు ఆదాశర్మ పేరు మాత్రం మార్మోగిపోతోంది.
అందుకు కారణం ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) సినిమా. ఈ సినిమా గురించి ఇప్పుడు తెలియని వారెవ్వరూ లేరంటే అతిశయోక్తి కాదేమో.
నెగిటివిటీ తెచ్చి పెట్టిన భారీ పబ్లిసిటీ.!
అంతలా ఈ సినిమా గురించిన చర్చ నడుస్తోందిప్పుడు. మొన్న ‘కాశ్మీరీ ఫైల్స్’ సినిమా గురించి మాట్లాడుకున్నారు. ఆ రేంజ్లో ఇప్పుడు ‘ది కేరళ స్టోరీ’ గురించి మాట్లాడుకుంటున్నారు.
ఆదాశర్మ లీడ్ రోల్లో రూపొందింది (Adah Sharma The Kerala Story) ‘ది కేరళ స్టోరీ’. ఈ సినిమాలో ఆదా శర్మ నటనకు అంతా ఫిదా అయిపోతున్నారు. హిందూ యువతిగా, ముశ్లిం యువతిగా అద్భుతమైన నటన కనబరిచింది ఆదా శర్మ.
మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఈ సినిమా నేపథ్యం వుందంటూ ఈ సినిమాని బ్యాన్ చేయాలంటూ రిలీజ్‌కి ముందే పెద్ద ఎత్తున రచ్చ జరిగింది.
దేవుడు వరమందిస్తే.. అది ఇలాగే వుంటుందేమో.!
అయినా సినిమా రిలీజ్ ఆగలేదు. రిలీజ్ తర్వాత జనం నోట్లో ఇంకా బాగా నానడంతో ఆదాశర్మ పంట పండింది. ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఆశపడిన ఆదా కోరిక ఈ సినిమా రూపంలో తీరిపోయినట్లయ్యింది.
Also Read: Swetha Naagu.. అత్యంత విషపూరితమా.! అసలుందా.?
ఊహించని విధంగా ఆదా శర్మకు స్టార్డమ్ తెచ్చిపెట్టేసింది ‘ది కేరళ స్టోరీ’ సినిమా. ఇంకేముంది.! రాత్రికి రాత్రే ఆదా శర్మ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఒక్కదెబ్బకి ప్రపంచం దృష్టిలో పడిపోయిందంతే.!
చూడాలి మరి, ఈ సినిమా తెచ్చి పెట్టిన క్రేజ్ ఆదా శర్మ కెరీర్‌ని ఎటు మలుపు తిప్పుతుందో.!