Home » Swetha Naagu.. అత్యంత విషపూరితమా.! అసలుందా.?

Swetha Naagu.. అత్యంత విషపూరితమా.! అసలుందా.?

by hellomudra
0 comments
Swetha Naagu White Cobra

Swetha Naagu White Cobra.. పామును చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. ఆ భయంతోనే కొందరు పాములు కనిపిస్తే చంపేస్తారు.

హిందూ సనాతన ధర్మంలో నాగుపామును నాగేంద్రుడిగా, నాగ దేవతగా కొలుస్తూ పూజలు చేస్తుంటారు.

నాగుల చవితి, నాగ పంచమికి హిందూ ధర్మంలో ప్రత్యేకమైన విశిష్టత వుంది. ఈ రోజుల్లో పాములకు పాలు పోసి, నైవేద్యాలు పెట్టి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమనీ సదా కాపాడమని కోరుతూ ఎంతో భక్తితో కొలుస్తుంటారు.

Swetha Naagu White Cobra.. పాములు పగపడతాయా.?

పాము పగ గురించి పలు పురాణ గాధలున్నాయ్. వాటిని బేస్ చేసుకుని చాలా సినిమాలు కూడా తెరకెక్కాయ్. అయితే నిజంగానే సినిమాల్లో చూపించినట్లుగా పాములు పగబడతాయా.?

పాములు పగబట్టవని శాస్త్రీయంగా నిరూపింతమైంది. కేవలం, స్వీయ రక్షణార్ధమే విష సర్పాలు తమ విషాన్ని ఉపయోగిస్తాయ్. స్వీయ రక్షణలో జరిగే దాడి క్రమంలోనే పాములు విషాన్ని వెదజల్లుతాయ్.

శ్వేత నాగు సంగతేంటీ.?

శ్వేత వర్ణం అంటే తెలుపు. నాగు అంటే నాగు పాము. తెలుపు వర్ణంలో వుండే నాగుపామును శ్వేత నాగు అంటారు. చాలా అరుదుగా మాత్రమే శ్వేతనాగులు చూస్తుంటాం.

సౌందర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘శ్వేత నాగు’ సినిమా మంచి విజయం అందుకుని, ప్రేక్షకుల మెప్పు పొందిన సంగతి తెలిసిందే.

ఆ సినిమాలో మాదిరి శ్వేత నాగు విషం అంత శక్తివంతమైనదా.? శ్వేత నాగు పగ జన్మ జన్మలకూ వుంటుందా.? అంటే, అలాంటిదేమీ లేదని అవన్నీ కేవలం కట్టు కథలు మాత్రమే, సినిమా కోసం సృష్టించిన అదో పాంటసీ మాత్రమే అంటారు.

కాటు వేస్తే ఖేల్ ఖతం.?

కేవలం జన్యుపరమైన లోపాల వల్లే కొన్ని పాములు తెల్ల రంగులో వుంటాయనీ, వాటినే శ్వేత నాగులుగా పిలుస్తామనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కేవలం నాగు పాములే కాదు, కొన్ని రకాల కొండచిలువలు కూడా తెల్ల రంగులో వుంటాయట. ఇక, శ్వేత నాగు విషం గురించి చెప్పాలంటే, సాధారణ నాగుపాము విసం మాదిరిగానే శ్వేత నాగు విషం కూడా వుంటుంది.

ఏ విష సర్పం విషమైనా ప్రమాదరకరమైనదే. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా పాము కాటుకు గురి అయితే, వైద్యుని సలహాతో చికిత్స తీసుకోవాల్సిన అవసరముంది.

Swetha Naagu White Cobra.. పాములు అసలెందుకు బుసలు కొడతాయ్.?

విష సర్పాలు మనుషుల్ని చంపడానికే కాదు విషం తయారు చేసుకునేది. కేవలం వాటిని అవి రక్షించుకోవడానికి, ఆహార సేకరణ కోసం మాత్రమే.

Also Read: పొలిటికల్ ఎంవోయూ.! నిజం.. నేతి బీరకాయ్.!

మనుషులు లేదా జంతువులు ఎదురు పడినప్పుడు చేసే హెచ్చరిక సంకేతమే బుసలు కొట్టడం. తమని తాము రక్షించుకునే క్రమంలో బుసలు కొడుతూ మీదికొస్తాయ్. వాటి ప్రాణాలకు ప్రమాదమని భావిస్తే విషయం చిమ్ముతాయ్.

తాజాగా తమిళనాగులోని కోయంబత్తూర్‌లో కురుచ్చి శక్తినగర్‌లో శ్వేత నాగు స్థానికులకు కనిపించింది. వెంటనే అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు.

వారు పాముని జాగ్రత్తగా పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. గతంలోనూ ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో శ్వేత నాగు కనిపించింది.

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group