Priya Vadlamani Mukha Chitram.. ‘ముఖ చిత్రం’ అనే సినిమా ఇటీవల ఓటీటీ వేదికగా చాలా మంది ప్రేక్షకులు వీక్షించి వుంటారు. సినిమా కాన్సెప్ట్ బాగుంది. ఇద్దరు హీరోయిన్లు, ఒక హీరో.. మంచి పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు.
సినిమా ఆధ్యంతం ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఈ సినిమాలోని ఇద్దరు హీరోయిన్లలో ఓ హీరోయిన్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం.
ఆమె పేరు ప్రియ వడ్లమాని. ‘ముఖ చిత్రం’ సినిమాలో ఇంపార్టెంట్ లీడ్ ఫీమేల్ రోల్ పోషించింది ఈ ముద్దుగుమ్మ. అబ్బో.! తనకిచ్చిన పాత్రకి ఓ రేంజ్‌లో న్యాయం చేసేసిందనుకోండి.

అందుకే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇంతకీ ఎవరీ ప్రియ వడ్లమాని.? పదహారణాల తెలుగమ్మాయ్. హైద్రాబాద్‌లోనే పుట్టి పెరిగింది.
Priya Vadlamani Mukha Chitram.. నటనే కాదు అంతకు మించి..
సినిమాలంటే ఆసక్తి. మోడలింగ్‌లో శిక్షణ తీసుకుంది. గ్లామర్ రంగంతో కెరీర్ స్టార్ట్ చేసి, టెక్నికల్‌గానూ కొంత అవగాహన పెంచుకుంది.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఒకింత శిక్షణ పుచ్చుకుంది. అమ్మడికున్న టాలెంట్ మెచ్చి హీరోయిన్‌గా ట్రై చేయమని సన్నిహితుల సలహాలివ్వడంతో, ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టింది.

ఆ క్రమంలోనే ‘శుభలేఖలు’, ‘హుషారు’, ‘ఆవిరి’ తదితర చిత్రాల్లో నటించింది. కానీ, ‘ముఖ చిత్రం’ ప్రియ వడ్లమానికి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.
ఎలాంటి రోల్ అయినా విశ్వరూపమే..
ఛాలెంజింగ్ రోల్స్ చేయడమంటే తనకెంతో ఇష్టమంటోంది. ఆ సత్తా కూడా వుందీ ముద్దుగుమ్మలో. అయితే, ముంబై ముద్దుగుమ్మల మోజులో పడి ఈ పదహారణాల తెలుగందం కనిపించడం లేదు కాబోలు మన సినీ జనాలకి.

ఇక, గ్లామర్ విషయానికి వస్తే, ఎలాంటి మొహమాటాల్లేవ్ ప్రియ వడ్లమానికి. ట్రెడిషనల్, మోడ్రన్.. ఇలా ఎంత గ్లామరస్‌గా కనిపించడానికైనా సై అంటోంది. ఆ క్రమంలోనే తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది ప్రియ వడ్లమాని.
శారీలో ట్రెడిషనల్‌గా కనిపిస్తూనే బోలెడంత గ్లామర్ ఒలకబోసేస్తోందీ పిక్స్‌లో ప్రియ. ఈ ఫోటోలు తాజాగా నెట్టింట వైరల్ అవుతున్నాయ్.