Table of Contents
OG Pawankalyan vs Ramcharan.. ‘ఓజి’ అంటే, ‘ఓ గాడ్’ అనాలా.? ‘ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ అనాలా.?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకి సంబంధించి ‘దే కాల్ హిమ్ ఓజీ’ అంటూ ఇంట్రెస్టింగ్ ప్రచారాన్ని తెరపైకి తెచ్చాడు దర్శకుడు సుజీత్.
‘ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్’ అని కూడా సుజీత్ అండ్ టీమ్ పేర్కొంది. సినిమా టైటిల్ దాదాపుగా ‘ఓజీ’ కావొచ్చన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘ఓజీ’ అంటే ‘ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ అని అర్థమట.
హీరోల్ని అభిమానిస్తున్నారా.? లేదంటే, ఆయా హీరోల మీద అభిమానమంటూ.. ‘అభిమాన వ్య..బి..చారం’ చేస్తున్నారా.?
Mudra369
ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళాల్సి వుంది.
OG Pawankalyan vs Ramcharan.. బాబాయ్ వర్సెస్ అబ్బాయ్..
చిరంజీవి తన సోదరుడు పవన్ కళ్యాణ్‌ని తమ్ముడిగానే కాదు.. ‘బిడ్డ’లా చూసుకుంటారు. పవన్ కళ్యాణ్ సంగతి సరే సరి.. చిరంజీవి తనయుడు రామ్ చరణ్‌ని తన బిడ్డలానే చూసుకుంటాడు.
చరణ్ సంగతి సరే సరి.. చిరంజీవి, పవన్ కళ్యాణ్.. ఈ ఇద్దరి మీదా ఈగవాలనివ్వడు మెగా పవర్ స్టార్.
మరి, పవన్ కళ్యాణ్ అభిమానులు.. రామ్ చరణ్ అభిమానులు ఎందుకు సోషల్ మీడియా వేదికగా కొట్టుకుంటున్నట్టు.?
ఫేక్ అభిమానుల రచ్చ..
కొన్ని ఫేక్ అక్కౌంట్ల ద్వారా ‘ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ రామ్‌చరణ్..’ అని పేర్కొంటూ. పవన్ కళ్యాణ్ మీద బూతులు తిడుతూ అది చరణ్ అభిమానులు చేసినట్లుగా క్రియేట్ చేశారు కొందరు.
అలాంటి ఫేక్ అక్కౌంట్ల ద్వారానే పవన్ కళ్యాణ్ అభిమానుల ముసుగులో రామ్ చరణ్ మీద బూతులు తిడుతూ కొందరు పోస్టులు పెట్టారు.

వెరసి, వివాదం ముదిరి పాకాన పడింది. గతంలో చిరంజీవి – పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ఇదే ఛండాలమైన గేమ్ ప్లే అమలు చేశారు. మెగా వర్సెస్ అల్లు రచ్చ కూడా ఈ కోవలోనిదే.!
అభిమానులు అంత వెర్రి వెంగళప్పలా.?
ఆయా హీరోల అభిమానులుగా.. ఆయా హీరోల తరఫున తామే వకాల్తా పుచ్చుకుంటున్నట్లుగా కొందరు సున్నితమనస్కులైన అభిమానులు, సంయమనం కోల్పోతుండడమూ ఇలాంటి వివాదాలకు కారణం.
Also Read: శంకరుడికి ఆభరణంగా కైలాసానికి: చిరంజీవి హృదయ స్పందన!
నిజానికి, మెగా హీరోలనే కాదు.. టాలీవుడ్‌లో దాదాపుగా హీరోలంతా కలిసే వుంటారు. కానీ, అభిమానుల మధ్యనే ఛండాలమైన చర్చ జరుగుతోంది.
చరణ్ – ఎన్టీయార్ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ చేసినా ఈ గొడవలు ఆగలేదంటే, అసలు ఆయా అభిమానులు ఆయా హీరోల్ని అభిమానిస్తున్నారా.? లేదంటే, ఆయా హీరోల మీద అభిమానమంటూ.. ‘అభిమాన వ్య..బి..చారం’ చేస్తున్నారా.?