Harish Shankar Remake.. దర్శకుడు హరీష్ శంకర్ చాలా ఎగ్రెసివ్.! విషయ పరిజ్ఞానం వున్నోడే. ‘గబ్బర్ సింగ్’ లాంటి సూపర్ హిట్ ఇచ్చినోడు.
ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) సినిమాని తెరకెక్కిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఇది రెండో సినిమా.
ఇక, ‘2018’ పేరుతో వచ్చిన ఓ డబ్బింగ్ సినిమాని ప్రమోట్ చేయడానికి మీడియా ముందుకొచ్చాడు హరీష్ శంకర్ (Harish Shankar).
Harish Shankar Remake.. సినీ జర్నలిస్టుపై కౌంటర్ ఎటాక్..
‘చులకన చేసే నోరు వున్నప్పుడు.. చురకలు వేసే నోరు కూడా వుంటుంది..’ అంటూ సోషల్ మీడియాలో హరీష్ శంకర్ ట్వీటేశాడు.
దానికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడయన. ఓ జర్నలిస్టు, సంధించిన ఓ అర్థం పర్థం లేని ప్రశ్నపై హరీష్ శంకర్ సెటైరేశాడు.
ఈ క్రమంలో ‘బాహుబలి’ని ఎవరైనా డబ్బింగ్ సినిమా అనుకున్నారా.? ‘కేజీఎఫ్’ (KGF), ‘కాంతారా’ లాంటి సినిమాల్ని డబ్బింగ్ సినిమాలని అనగలమా.? అని ప్రశ్నించాడు హరీష్ శంకర్.
ఎందుకు కాదు.? ‘బాహుబలి’ సినిమా తెలుగు తప్ప, ఇతర భాషల్లో చూసినవారికి అది డబ్బింగ్ సినిమానే.
‘కేజీఎఫ్’ని స్ట్రెయిట్ తెలుగు సినిమా అనగలమా.? ‘కాంతారా’ అయినా అంతే.! డబ్బింగ్, రీమేక్, ద్విభాషా చిత్రాలు.. త్రిభాషా చిత్రాలు.. ఇలా దేనికదే ప్రత్యేకమైన గుర్తింపు వుంటుంది.
ట్రెండ్ మారినమాట వాస్తవం..
సినిమాని భాషలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆదరిస్తున్న పరిస్థితుల్ని చూస్తున్నాం. కానీ, డబ్బింగ్ డబ్బింగే.. స్ట్రెయిట్ స్ట్రెయిటే.! ఆ గీతని చెరిపేయడమెలా సాధ్యమవుతుంది.?
Also Read: రామ్ చరణ్.! జర జాగ్రత్త.! గుడ్డిగా నమ్మితే వెన్నుపోటే.!
పనికిమాలిన ప్రశ్నలేస్తూ, హీరోయిన్లను కించపరుస్తున్న జర్నలిస్టుకి హరీష్ శంకర్ ఇచ్చిన కౌంటర్ ఎటాక్‌ని స్వాగతించగలంగానీ.. డబ్బింగ్, రీమేక్, స్ట్రెయిట్.. సినిమాల మధ్య వున్న వ్యత్యాసాన్ని లేదని ఎలా అనగలం.?
అన్నట్టు హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘గద్దల కొండ గణేష్’ కూడా రీమేక్ సినిమానే.!
రీమేక్ సినిమాలు చేస్తున్నాడని హరీష్ శంకర్‌ని కావొచ్చు.. ఇంకో దర్శకుడ్నికావొచ్చు.. తప్పు పట్టాల్సిన పనిలేదు.
తమదైన ప్రత్యేక ముద్రని ఆయా సినిమాలపై వేస్తే, ఆయా దర్శకుల్ని అభినందించి తీరాలి కూడా. అది వేరే చర్చ.