Allu Arjun National Award.. అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డు దక్కింది. అదీ ఉత్తమ నటుడి కేటగిరీలో.
69వ జాతీయ సినీ పురస్కారాల ప్రకటన తర్వాత, తెలుగు సినీ పరిశ్రమలో సంబరాలు చూస్తున్నాం.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి అవార్డులు పోటెత్తాయ్. ‘ఉప్పెన’ సినిమానీ జాతీయ పురస్కారం వరించింది. ‘పుష్ప’ సినిమాకి ఉత్తమ సంగీతం కేటగిరీలోనూ, ఉత్తమ నటుడు కేటగిరీలోనూ అవార్డు దక్కింది.
Allu Arjun National Award.. అలా ఎలా ఇస్తారు.?
అయినా, అల్లు అర్జున్‌కి ఎలా జాతీయ ఉత్తమ నటుడు కేటగిరీలో పురస్కారం ప్రకటిస్తారంటూ, నేషనల్ ఫిలిం అవార్డ్స్ జ్యూరీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర, నెగెటివ్ షేడ్స్‌తో వుంటుంది. స్మగ్లర్ పాత్ర అది.! క్రిమినల్ పాత్రకి జాతీయ పురస్కారమేంటి.? అన్న చర్చ తెరపైకొచ్చింది.
ఈ మేరకు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. అల్లు అర్జున్ అభిమానులు ఈ ట్రోలింగ్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఓ సెక్షన్ మీడియా కూడా, ‘సంఘ వ్యతిరేక శక్తి’గా ‘పుష్ప’ సినిమాలో హీరో పాత్ర వుంటుందనీ, అలాంటి పాత్రలో నటించిన నటుడికి జాతీయ అవార్డుని ఉత్తమ నటుడి కేటగిరీలో ఇవ్వడం సబబు కాదంటూ కథనాల్ని వండి వడ్డిస్తోంది.
అయితే, అల్లు అర్జున్ (Allu Arjun) నటనా ప్రతిభకు దక్కిన గౌరవంగా ఈ పురస్కారన్ని అల్లు అర్జున్ అభిమానులు భావిస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో, ఇంతవరకు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని ఎవరూ దక్కించుకోలేకపోయారు. తొలిసారిగా ఆ గౌరవాన్ని అల్లు అర్జున్ దక్కించుకోవడం విశేషమే.
Also Read: మూసుకుని చూడాల్సిందే! ‘చిరు’పై విజయ్ ‘మెగా’ కామెంట్స్!
సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. అల్లు అర్జున్‌కి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం ప్రకటిమవడం పట్ల దర్శకుడు సుకుమార్ సహా ‘పుష్ప’ టీమ్ హర్షం వ్యక్తం చేసింది.
అల్లు అర్జున్ ఇంటికి దర్శకుడు సుకుమార్ వెళ్ళి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, తన కుమారుడు సాధించిన విజయం పట్ల ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు.