Hbd Balakrishna Yuvraj Singh.. టీమిండియా క్రికెటర్ చాలా చాలా పెద్ద తప్పు చేసేశాడు.! తెలిసి చేసిన తప్పు కాకపోవచ్చు. కానీ, బాలయ్య అభిమానులు బాగా హర్టయిపోతున్నారు.
నందమూరి బాలకృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీటేశాడు యువీ (Yuvraj Singh). బాలయ్య అభిమానులు సంతోషపడాల్సిన విషయమే కదా అది.?
కానీ, అసలు విషయం వేరే.! శుభాకాంక్షలు తెలిపే క్రమంలో యువరాజ్ సింగ్ షేర్ చేసిన ఫొటో మీదనే బాలయ్య అభిమానులకి అభ్యంతరం.!
Hbd Balakrishna Yuvraj Singh.. మార్ఫింగ్ ఫొటో ఎలా వచ్చింది.?
బసవ తారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌ని నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నిర్వహిస్తున్న తీరుని ప్రస్తావించాడు క్రికెటర్ యువరాజ్ సింగ్.

అన్నట్టు, యువీ కూడా క్యాన్సర్ బాధితుడే. క్యాన్సర్‌పై పోరాటంలో విజయం సాధించాడు. అందుకే, క్యాన్సర్ మహమ్మారి గురించి బాగా తెలుసతనికి.
ఇంతకీ, మార్ఫింగ్ ఫొటో ఎలా వచ్చినట్లు.? గూగుల్ చేసి వెతికిన ఫొటోని యువీ పోస్ట్ చేశాడా.? అదే జరిగి వుండొచ్చు.!
గతంలో బాలయ్యని కలిసిన ఫొటోనే..
గతంలో బాలయ్యని యువీ కలిశాడు. ఈ క్రమంలో తీసిన ఫొటోనే సోషల్ మీడియాలో యువరాజ్ సింగ్ పోస్ట్ చేశాడు. కానీ, అది మార్ఫింగ్‌కి గురయ్యింది.
అదీ అసలు సంగతి.! ఎవరు మార్ఫింగ్ చేశారోగానీ, దాన్ని చూసుకోకుండా యువీ (Yuvraj Singh) పోస్ట్ చేసెయ్యడం చర్చనీయాంశమవుతోంది.