Janasenani Varahi Vijaya Yatra.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో అడుగు పెట్టి తీరతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు.!
తనను ఓడించేందుకు 200 కోట్లు ఖర్చు పెట్టడానికి అధికార వైసీపీ సిద్ధంగా వుందనీ, అయినా ఈ సారి తన గెలుపుని ఎవడూ ఆపలేడని జనసేనాని స్పస్టం చేశారు.
అసలేంటి పవన్ కళ్యాణ్ ధైర్యం.? 2019 ఎన్నికలకీ, ఇప్పటికీ ఏం మారిందని.? అసలు జనసేన అధినేత (Jana Sena Party Chief Pawan Kalyan) ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు.?
Janasenani Varahi Vijaya Yatra.. వ్యూహం మారింది..
ఔను, వ్యూహం మారింది.! 2019 ఎన్నికల్లో అత్యంత వ్యూహాత్మకంగా జనసేన పార్టీని దెబ్బ తీసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
కానీ, ఈసారి జనసేనాని వ్యూహాలు చాలా భిన్నంగా వున్నాయ్ 2019 ఎన్నికలతో పోల్చితే. పోటీ చేయబోయే నియోజకవర్గంపై జనసేనాని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రత్యర్థి పార్టీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా, అత్యంత వ్యూహాత్మకంగా జనసేనాని (Jana Sena Party Chief Pawan Kalyan) అడుగులు వేస్తున్నారు.
అదే సమయంలో, జనసేన ఓటు బ్యాంకు గతంతో పోల్చితే గణనీయంగా పెరిగింది. ఆ పెరుగుదల 25 శాతం వరకూ వుందని కొన్ని సర్వేలు చెబుతున్న సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రి పదవి వస్తే..
మీరు ఇస్తే.. ముఖ్యమంత్రి పదవి నన్ను వెతుక్కుంటూ వస్తే.. తీసుకుంటానంటూ జనసేన (Jana Sena Party) అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
Also Read: బాబూ ‘అన్‌స్టాపబుల్’ సన్నీ.! బిర్యానీ టేస్ట్ తెలుసా నీకు.?
వారాహి విజయ యాత్ర పేరుతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి రాజకీయ పర్యటన ప్రారంభించారు జనసేనాని.
తొలి రోజు బహిరంగ సభ కత్తిపూడిలో జరగ్గా, వేలాదిగా జనం స్వచ్ఛందంగా తరలి వచ్చారు. అధికార వైసీపీపై ఈ సభలో నిప్పులు చెరిగారు జనసేనాని.

దోపిడీని అరికట్టగలిగితే, సంక్షేమ పథకాలు అమలు చేయడం మరింత సులవవుతుందన్న జనసేనాని (Janasenani Pawan Kalyan), జనసేన అధికారంలోకి వస్తే అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పారు.
వైసీపీ (YSR Congress Party) హయాంలో ఇసుక సహా అన్నీ దోపిడీకి గురవుతున్నాయనీ, అన్నిటా అవినీతి రాజ్యమేలుతోందని విమర్శించారు జనసేనాని (Janasenani Pawan Kalyan).